మెహర్ రమేష్ ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే అనుకుంటున్నారా? అవును కన్నడంలో మంచి బిగ్ హిట్లను సాధించిన మెహర్ రమేష్ తెలుగులో మాత్రం పెద్దగా హిట్ కాలేకపోయారు. దాంతో ఆయనతో సినిమా అంటే హీరోలు ఆమడదూరం పారిపోయేవారు. అలాంటి పరిస్థితిలో ఆయనకు సూపర్‌స్టార్ హీరో మహేష్ టీంలో చోటు దొరికింది. మహేష్‌బాబుతో యాడ్లు, చిన్న చిన్న ప్రకటనలు చేస్తున్న ఈ దర్శకుడికి మహేష్ బాబు గొప్ప బూస్టు ఇచ్చారు.
‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం ఒకేసారి మెహర్ రమేష్‌ని ఆదుకుందనే చెప్పాలి. సరిలేరు గుంటూరు రైట్స్ మెహర్ రమేష్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అక్కడ అడ్వాన్సుల రూపంలోనే ఆయన పెట్టుబడి వచ్చేసిందట. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో.. కలెక్షన్లు వర్షం కురుస్తుంది. మెహర్‌కు భారీ లాభాలు ఖాయం అంటున్నారు. అందులోనూ సంక్రాంతి పండగకు విడుదలైన ఈ చిత్రం భారీగానే వసూళ్ళను రాబడుతుంది. పైగా ఆంధ్రాలో పండగలకు సినీ ప్రేమికులు సినిమాలు ఎలా చూస్తారో పెద్దగా చెప్పక్కర్లేదు. మహేష్‌బాబు దయతో డిస్ర్టిబ్యూటర్ అవతారమెత్తి, తొలి చిత్రంతోనే భారీ సక్సెస్ అందుకున్న మెహర్ రమేష్ ముందు ముందు ఈ సక్సెస్‌ను ఇలానే కంటిన్యూ చేస్తారా? అన్న అనుమానాన్ని సినీ జనాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇంత మంచి అవకాశం వచ్చింది కాబట్టి ఆయన తర్వాత తీసుకునే చిత్రాలు కూడా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తే తిరిగి పూర్వ వైభవంకి చేరుకోవచ్చు. పైగా సంక్రాంతి లాంటి పెద్ద పండగకి సక్సెస్ కొడితే ఇంక సూపర్‌డూపర్ హిట్టే అని మరికొందరు సెంటిమెంట్‌గా భావిస్తున్నారు. మొత్తానికి ఈ క్రెడిట్ అంతా మహష్కే ఇస్తున్నారు ఆయన ఫ్యాన్స్ ఎందుకంటే ఎన్ని చిత్రాలు చేసినా కూడా పెద్దగా సక్సెస్ కాలేనప్పుడు మహేష్ చిత్రంతో సక్సెస్ సాధించగానే అందరూ సెంటిమెంట్‌గానే ఫీలవుతున్నారు. మరి దీన్ని మెహర్ రమేష్ ఎంత వరకు సక్సెస్ గా ఫీలవుతారన్నది తెలియాలి.