‘భాగమతి’ మూవీ విడుదలై రెండు సంవత్సరాలు అయినా ఇంకా అనుష్క సినిమా ఏమి విడుదల కాలేదు. వాస్తవానికి ఆమె నటించిన ‘నిశ్శబ్దం’ ఈ నెల 31న విడుదల కావలసి ఉంది. ఈ సినిమాను విడుదల అవ్వకుండా అడ్డుపడుతున్న శక్తి అనుష్క మాత్రమే అంటూ ఇప్పుడు లేటెస్ట్ గా వార్తలు గుప్పు మంటున్నాయి. 

తెలుస్తున్న సమాచారం మేరకు కొద్ది రోజుల క్రితం ఈ మూవీ ఫైనల్ అవుట్ పుట్ ను చూసిన అనుష్క ఈ మూవీలో చాల మార్పులు చేయాలని అప్పటి దాకా ఈ మూవీని విడుదల చేయవద్దు అంటూ సూచనలు ఇచ్చినట్లు టాక్. అయితే ఈ మూవీని అనుకున్న విధంగా ఈ నెల 31న విడుదల చేస్తాము అని చెప్పిన ఈ మూవీ నిర్మాతలకు ఆమె ఊహించని షాక్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. 

ఈ మూవీలో తాను చెప్పిన మార్పులు చేయకుండా విడుదల చేస్తే తాను ఈ మూవీ ప్రమోషన్ కు రానని తెగేసి చెప్పడంతో ఆమె మాటల ఒత్తిడికి నిర్మాతలు దిగి వచ్చి ఇప్పుడు ఈ మూవీకి రిపేర్లు చేస్తున్నట్లు సమాచారం. దీనితో ఈ రిపేర్ల కార్యక్రమం అంతా పూర్తి అయి ఈ మూవీ విడుదల కావడానికి కనీసం మరొక నెల సమయం పడుతుంది అని అంటున్నారు. 

అయితే ఫిబ్రవరి నెల కూడ దాటిపోతే మార్చినెల ప్రారంభం అయి పరీక్షల సీజన్ మొదలవుతుంది కాబట్టి ఈ మూవీని ఎదో విధంగా ఫిబ్రవరి 20న విడుదల చేయాలి అని నిర్మాతలు ప్రయత్నిస్తున్నా అంత స్పీడ్ గా ఈ మూవీ రిపేర్ వర్కులు పూర్తి ఆవుతాయా అన్న సందేహాలు కలుగుతున్నాయి. సాధారణంగా సినిమాకు సంబంధించి మార్పులు చేర్పులు చేయవలసిందిగా హీరోలు సూచిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు అనుష్క హీరో స్థాయిలో ఈ మూవీ నిర్మాతల పై చేసిన ఒత్తిడి బట్టి ఆమె రేంజ్ ఏ స్థాయిలో ఉందో అర్ధం అవుతుంది..

 

మరింత సమాచారం తెలుసుకోండి: