ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన చిరంజీవి ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ తెలుగు ప్రేక్షకులందరికీ మెగాస్టార్ చిరంజీవి గా మారిపోయారు. ఎన్నో సంచలన విజయాలను సొంతం చేసుకుని... మెగాస్టార్ చిరంజీవికి తెలుగు చిత్ర పరిశ్రమలో తిరుగులేదు అని నిరూపించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో అంచలంచలుగా ఎదిగిన చిరంజీవి... తెలుగు చిత్ర పరిశ్రమకి ఎంతగానో వన్నె తెచ్చారు. ఇక చిరంజీవి ఎన్నో విషయాల్లో  ఆయనకు ఆయనే సాటి అని చెప్పాలి.పవర్ ఫుల్ డైలాగులు చెప్పడంలో నైనా... అదిరిపోయే స్టెప్పులు వేసి అందరిని మెస్మరైజ్ చేయడం లోనైనా... ఆకట్టుకునే కామెడీ టైమింగ్ తో అందరినీ కడుపుబ్బ నవ్వించాలీ  అన్నా.. ఆయన మంచి పనులతో  అందరికీ ఆదర్శంగా నిలవాలి అన్నా.. మెగాస్టార్ చిరంజీవి ఆయనకు ఆయనే సాటి.

 

 

 అయితే పునాదిరాళ్లు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం అయిన చిరంజీవి.. ఆ తర్వాత తన లోని ప్రతిభను చూపించి ఎంతో మంది దర్శక నిర్మాతలను ఆకర్షించారు. ఇక ఆ తర్వాత ఖైదీ సినిమా తో స్టార్ హీరోగా మారిపోయాడు చిరంజీవి. అప్పటికే చిత్ర పరిశ్రమలో ఉన్న  హీరోల అందరి కంటే ఎక్కువ ఇమేజ్ సంపాదించి.. అసంఖ్యాక ప్రేక్షకాదరణను చూరుకున్నారు. శివశంకర వరప్రసాద్ గా ఉన్న చిరంజీవి.. ఆ తర్వాత తెలుగు ప్రేక్షకుల సుప్రీం హీరోగా .. ఆ తర్వాత మెగాస్టార్ గా మారిపోయాడు. ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు నిలువుటద్దంలో మారిపోయారు మెగాస్టార్ చిరంజీవి. 

 


 అయితే చిరంజీవి కెరియర్ మొదట్లో కూడా ఎన్నో కష్టాలు పడ్డారు. అయితే చిరంజీవి పారితోషికం గురించి ప్రస్తుతం చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో చిరంజీవిదే అగ్రతాంబూలం అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే చిరంజీవికి ఉన్న క్రేజ్ అలాంటిది మరి. జూనియర్ హీరోలు కూడా చిరంజీవికి సాటిరారు అనే విధంగా ఇప్పటికీ తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. అయితే చిరంజీవి మొదటి సినిమా పారితోషికం ఏమిటో తెలుసా... చిరంజీవి హీరోగా పరిచయమైన సినిమా కాదు చిరంజీవి మొదట గా నటించిన సినిమా తాయారమ్మ బంగారయ్య. ఈ సినిమాకు ఏడిద నాగేశ్వరరావు నిర్మాతగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే ఓ రోజు చిరంజీవి కి రెండు నిమిషాలు పాత్ర  ఇచ్చేందుకు వచ్చిన నిర్మాత ఏడిద నాగేశ్వరరావు.. ఈ సినిమాలో  చిరంజీవికి పారితోషికం ఇవ్వనని  చిరంజీవి గదిలో ఉన్న డొక్కు ఫ్యాన్ కు బదులు కొత్తది కొనిస్తాను  అంటుంది మాట ఇచ్చారు. చిరంజీవి సినిమా చేసిన తర్వాత నిర్మాత ఫ్యాన్ కొనివ్వకుండా మాట తప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: