ప్రీమియర్ మోటార్ సైకిల్ ఉత్పత్తి దారులు కెటిఎమ్ కంపెనీ తన నూతన మోడల్ కెటిఎమ్ ‘డ్యూక్ 200’ ధర 1.4 లక్షలుగా నిర్ణయించి ఆ బైక్ మోడల్ కు పాపులారిటీ కలిపించాలనే ఉద్దేశ్యంతో ఈ బైక్ ను మహేష్ బాబు ‘వన్’ సినిమాలో నిర్మాతలతో ఒప్పందం చేసుకుని ఉపయోగించారు. వన్ సినిమా మహేష్ అభిమానులను కూడా సంతృప్తి పరచలేక పోవడంతో ఈ సినిమా మహేష్ సినిమాలలో మరిచిపోలేని పరాజయాల లిస్టులో చేరిపోయింది.
మహేష్ ఈ పీడకలను మరిచిపోయి తన ‘ఆగడు’ సినిమా షూటింగ్ లో బిజీగా గడిపేస్తున్నా ప్రిన్స్ అభిమానులు మాత్రం మహేష్ ‘వన్’ ఘోర పరాజయానికి ఈ డ్యూక్ 200 బైక్ కారణం అంటు కొత్త వాదన తెరపైకి తీసుకు వచ్చారు. వారి వాదన ప్రకారం గతంలో పవన్ కళ్యాణ్ ‘కెమెరా మెన్ గంగతో రాంబాబు’ సినిమాలో కూడా ఇటువంటి ఫ్యాన్సీ మోటార్ సైకిల్ ను వాడి పరాజయాన్ని కోరి తెచ్చుకున్నాడని ఉదాహరణ గా చెపుతూ టాప్ హీరోలకు డ్యూక్ బైక్స్ కలిసి రాలేదని కొత్త సిద్దాంతాన్ని పరిచయం చేయడమే కాకుండా బాలీవుడ్ హీరోలకు కూడా ఈ డ్యూక్ బైక్స్ కలిసి రాలేదు అని మహేష్ అభిమానులు గోల పెడుతున్నారు.
ఈ నేపధ్యంలో త్వరలో విడుదల కాబోతున్న బాలకృష్ణ ‘లెజెండ్’ లో కూడా బాలయ్య ఏరికోరి వెరైటీ బైక్ ను ఎంచుకున్నాడు కాబట్టి ఈ ఫ్యాన్సీ బైక్ ల సెంటిమెంట్ బాలయ్యను కూడా వేటాడుతుందా అంటూ నందమూరి అభిమానులకు అనుమానం భయంగా మారిందని టాక్.
మరింత సమాచారం తెలుసుకోండి: