ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో వరుసగా మల్టీస్టారర్ చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని, సుదీర్ బాబు మల్టీస్టార్ గా తెరెక్కుతున్న చిత్రం ‘వి’. ఈమద్య ఈ చిత్రం టీజర్ ని రిలీజ్ అయ్యింది. ఈ టీజర్ చూస్తుంటే నాని నెగిటీవ్ షేడ్స్ లో దుమ్మురేపబోతున్నట్లు తెలుస్తుంది. ఇక పోలీస్ ఆఫీసర్ గా సుదీర్ బాబు చాలా స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇద్దరి మద్య జరిగే ఛాలేంజ్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కతున్నట్లు తెలుస్తుంది. ఈ మద్య పెద్ద హీరోల చిత్రాలు రిలీజ్ కి ముందు తెగ హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పెద్ద హీరోలు, పెద్ద చిత్రాలు రిలీజ్ కి ముందు స్టోరీ ఇదే అంటే సోషల్ మీడియాలో రక రకాల కథనాలు వస్తుంటాయి.
గతంలో బాహుబలి, అత్తారింటికి దారేది మరికొన్ని చిత్రాలకు సంబంధించి ప్రతిరోజు ఒక స్టోరీ సోషల్ మీడియాలు వచ్చేవి. తీరా థియేటర్లో ఆ చిత్రం చూసిన తర్వాత తాము చదివింది ఫేక్ అన్న విషయం తెలిసిపోతుంది. తాజాగా ఇప్పుడు ఇంద్రగంటి మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని, సుదీర్ బాబు మల్టీస్టార్ గా తెరెక్కుతున్న చిత్రం ‘వి’. ఈ చిత్రం గురించి రక రకాల కథనాలు సోషల్ మీడియాలు వస్తున్నాయి. వి చిత్రం స్టోరీ ఇదే అంటే వార్తలు వస్తున్నాయి. మీడియాలో వస్తున్న స్టోరీ ప్రకారం.. ఈ చిత్రం కథ, కథనం అంతా 'వి' అనే అక్షరం చుట్టే తిరుగుతుందట.
తాను క్రైమ్ చేసిన ప్రతిచోట 'వి' అనే అక్షరాన్ని క్లూ గా వదిలి వెళ్తుంటాడట కిల్లర్. ఆ క్లూ ఆధారంతో ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ సాగిస్తుంటాడట.. ఆ నగరంలో హత్యల పెరిగిపోవడం.. అక్కడే ‘వి’ అక్షరాన్ని వదిలేసి వేళ్లడంతో ఆ నేరస్తుడు ఏం సంకేతాన్ని ఇస్తున్నారన్న విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారట. ఈ చిత్రంలో నాని డార్క్ షేడెడ్ క్యారెక్టర్ లో నటిస్తుండగా, సుధీర్ బాబు పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ మద్య ఫేక్ కథనాలు.. సోషల్ మీడియాాలో బగానే వస్తున్నాయి.. ఇది కూడా అలాంటిదే అని కొంత మంది కొట్టి పడేస్తున్నారు.