యాంకర్ ప్రదీప్ మాచిరాజు.. సాధారణంగా యాంకర్స్ అనగానే అమ్మాయిలే బాగా క్లిక్ అవుతారు. మేల్ యాంకర్స్ చాలా తక్కువగా పాపులారిటీ సంపాదిస్తారు. అలాంటి వారిలో ప్రదీప్ మాచిరాజు ఒకరు. టివి ఏదైనా షో ఏదైనా ప్రదీప్ వచ్చాడు అంటే షో సక్సెస్ అవ్వాల్సిందే. ఇన్నేళ్ళ బుల్లితెర కెరియర్ తర్వాత మొదటిసారిగా ప్రదీప్ హీరోగా సినిమా చేస్తున్నాడు. అదే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా..? మున్నా డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా నుండి వచ్చిన నీలి నీలి ఆకాశం సాంగ్ సూపర్ హిట్ అయ్యింది.

 

ఆ సాంగ్ తోనే సినిమాపై ఓ పాజిటివ్ బజ్ ఏర్పరచుకున్నారు. ప్రదీప్ సరసన అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా నుండి మరో రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. సెకండ్ సాంగ్ మాములుగా ఉన్నా లేటెస్ట్ గా వచ్చిన థర్డ్ సాంగ్ మీకో దండం మాత్రం బాగానే ఉంది. అమ్మాయిల గురించి టీజింగ్ సాంగ్ గా ఉన్న ఈ పాటలో ప్రదీప్ మాచిరాజు తన డ్యాన్స్ తో కూడా అదరగొట్టాడు. ప్రదీప్ లో ఇంట డ్యాన్స్ టాలెంట్ ఉందా అనేంతలా అతని పర్ఫార్మెన్స్ ఉంది.

 

తను హోస్ట్ గా చేసే ఈటివి డీ డ్యాన్స్ షోలో కూడా ప్రదీప్ ఎప్పుడు డ్యాన్స్ చేయలేదు. మరి అలాంటి ప్రదీప్ హీరోగా మారేసరికి అన్ని విధాలుగా టాలెంట్ చూపించేస్తున్నాడు. ఆల్రెడీ ఒక సాంగ్ హిట్ అయ్యింది.. ఇక డ్యాన్స్ లు ఇరగాదీస్తున్నాడు.. చూస్తుంటే ఈ సినిమా హిట్ అయితే ప్రదీప్ ఇక ఫుల్ టైం హీరోగా సెటిల్ అయ్యేలా ఉన్నాడని అనిపిస్తుంది. మరి ప్రదీప్ హీరోగా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.  సినిమాకు ఉన్న పాజిటివ్ బజ్ చూస్తే ప్రదీప్ తప్పకుండా హిట్టు కొట్టేలా ఉన్నాడు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: