బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ కు బాలకృష్ణ కు ఏమాత్రం వ్యక్తిగత సాన్నిహిత్య సంబంధాలు లేవు. తెలుగు హీరోలలో ఒక్క వెంకటేష్ తో మాత్రమే సల్మాన్ కు మంచి సాన్నిహిత్యం ఉంది. ఇలాంటి పరిస్థితులలో బాలయ్య లేటెస్ట్ ‘గుండు’ గెటప్ కు సల్మాన్ సలహాలు ఉన్నాయి అంటూ ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక ఒక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది.


గత కొంతకాలంగా బాలకృష్ణ గుండు తో కనిపిస్తున్న పరిస్థితులలో ఈ గెటప్ బాలయ్య బోయపాటి ల లేటెస్ట్ మూవీ కోసం డిజైన్ చేసుకున్న గెటప్ అన్న ప్రచారం జరిగింది. అయితే అసలు నిజం వేరు. బాలకృష్ణ ఎప్పుడు బయటకు వచ్చినా తన బట్టతల కనిపించకుండా విగ్ తో కవర్ చేసుకుంటూ రావడం అతడి అలవాటు. 


ఆఖరికి అసెంబ్లీ సమావేశాలకు కూడ బాలయ్య ఇలాగే విగ్ తో అనేకసార్లు వచ్చాడు. అయితే ఇలా తరుచు బయటకు వచ్చినప్పుడల్లా విగ్ పెట్టుకోవడం వల్ల బాలయ్య గుండుకు ఇన్ ఫెక్షన్ ఏర్పడటంతో డాక్టర్ల సలహా మేరకు హెయిర్ ట్రాన్స్ ప్లెన్ టేషన్ చేయించు కోవాలని నిశ్చయించుకోవడంతో బాలయ్య కొన్ని నెలల పాటు విగ్ లేకుండా పూర్తి గుండుతో ఉండవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయట.


అయితే బాలయ్యకు జరుగుతున్న హెయిర్ ట్రాన్స్ ప్లెన్ టేషన్ ప్రక్రియ పూర్తి అయ్యేదాకా బోయపాటి మూవీ షూటింగ్ ఆగే పరిస్థితి లేదు కాబట్టి బాలయ్య గుండుకు అనుగుణంగా బోయపాటి ‘అఘోర’ గెటప్ ను తన సినిమా కోసం క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. దీనితో బాలయ్య గుండు గెటప్ అతడి సినిమా కోసం కాకుండా అతడి హెయిర్ ట్రాన్స్ ప్లెన్ టేషన్ కోసమే అంటూ ఆ పత్రిక తన కథనంలో పేర్కొనడమే కాకుండా ఈ విషయంలో సల్మాన్ ఖాన్ హెయిర్ స్టైలిస్ట్ సలహాలతో బాలకృష్ణ తన కొత్త హెయిర్ స్టైల్ ను డిజైన్ చేసుకోబోతున్నాడు అంటూ వ్రాసిన కథనం నేటి హాట్ టాపిక్..

మరింత సమాచారం తెలుసుకోండి: