ఒకనాటి హీరోయిన్ గౌతమి తో 13 సంవత్సరాలు కమలహాసన్ సహజీవనం చేసాడు. వీరిద్దరూ భార్య భర్తలు అవ్వకపోయినా ఇండస్ట్రీలో భార్య భర్తలుగా చలామణి అయ్యారు. అంతేకాదు వీరిద్దరూ క్యాన్సర్ నివారణ కోసం అనేక సేవా సంస్థలు చేసే కార్యక్రమాలకు అతిధులుగా వచ్చిన సందర్భాలు కూడ ఉన్నాయి. 


బయటకురాని కొన్ని వ్యక్తగత కారణాలు వల్ల గౌతమి కమలహాసన్ లు విడిపోయారు. అయితే ఇప్పుడు గౌతమి వల్ల కమలహాసన్ కు సమస్యలు రావడంతో కమలహాసన్ అభిమానులు ఆమె పై మండిపడిపోతున్నారు. కరోనా సమస్య తీవ్రస్థాయికి చేరకముందు గౌతమి దుబాయ్ వెళ్ళి వచ్చింది. 


కరోనా సమస్య ఉగ్రరూపం దాల్చిన తరువాత విదేశాల నుంచి వచ్చిన వారందరికీ కరోనా టెస్ట్ లు చేస్తూ క్వారంటైన్ లో ఉంచుతున్న పరిస్థితులలో గౌతమి పాస్ పోర్ట్ లో కమలహాసన్ అడ్రస్ ఉండటంతో ఆమె కోసం తమిలాడు పోలీసులు కమలహాసన్ ఇంటికి వెళ్ళారట. అయితే ఈ విషయాలు తెలియక తమిళ మీడియాతో పాటు జాతీయ మీడియాలో కూడ కమలహాసన్ కు కరోనా వచ్చింది అంటూ ప్రచారం జరగడంతో అంతా బెంబేలెత్తిపోయారు. 


అయితే వాస్తవాలు వేరు గౌతమి వలన కమలహాసన్ పేరు బయటకు రావడంతో నష్టనివారణ చర్యలు చేపట్టిన గౌతమి తనకు కాని కమలహాసన్ కు కాని కరోనా వ్యాది లేదని ఇది కేవలం మీడియా కన్ఫ్యూజను వలన వచ్చింది అంటూ క్లారిటీ ఇచ్చింది. ఈ విషయాల పై కమల్ అభిమానులు మండిపోతూ కమల్ తో విడిపోయిన తరువాత కూడ అతడి అడ్రెస్ ను ఎందుకు వాడుకుంటున్నావు అంటూ గౌతమిని తిడుతున్నారు. దీనితో ఈ అనుకోని మాటల దాడికి గౌతమి షాక్ అవుతూ క్షమార్పణలు చెప్పుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. తమిళనాడు ప్రభుత్వం కరోనా బాధ్యుతుల కోసం చేపడుతున్న సహాయ కార్యక్రమాల కోసం కమలహాసన్ తన ఇంటిని కూడ ప్రభుత్వానికి ఉచితంగా ఇచ్చిన పరిస్థితులలో కమల్ దాతృత్వం పై తమిళ ల్ మీడియా ప్రశంసలు కురిపిస్తోంది..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: