ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది యువ హీరోలు ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఎవరికి వారు తమదైన స్టైల్లో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ముఖ్యంగా యువ హీరోలలో ఎక్కువగా ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమకు పరిచయమైన వారే ఎక్కువగా ఉన్నారు. ఇలా చిత్ర పరిశ్రమకు పరిచయమై తనదైన సొంత టాలెంట్తో ఎదుగుతున్న  హీరోలలో.. ఒకరు కార్తికేయ. షార్ట్ ఫిలిమ్స్ తో తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఆ తర్వాత వెండితెరపై హీరో గా ఎంట్రీ ఇచ్చాడు. 

 

 

 మొదట రెండు మూడు సినిమాల్లో నటించినప్పటికీ అంతగా గుర్తింపు సంపాదించలేక పోయాడు కార్తికేయ. ఇక ఆర్ఎక్స్ 100 అనే  సినిమాతో తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితుడిగా  మారిపోయాడు. ఆర్ఎక్స్ 100 సినిమాలో లవ్ ఫెయిల్యూర్ అయిన ఒక యువకుడి పాత్రలో నటించిన కార్తికేయ తనదైన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. ఇక అప్పటి నుంచి తెలుగు ప్రేక్షకులందరికీ కార్తికేయ సుపరిచితులు గా మారిపోవడంతో కార్తికేయ సినిమాల పై ప్రేక్షకుల్లో అంచనాలు పెరగడం మొదలైంది. 

 

 

 ఇక ఎప్పటికప్పుడు తన డాన్స్ పర్ఫార్మెన్స్ లతో కూడా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు కార్తికేయ. తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న యువ హీరోల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు అనే చెప్పాలి. ఎప్పటికప్పుడు తనని తాను కొత్తగా చూపించుకుంటూ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాడు కార్తికేయ. ప్రస్తుతం యువ హీరోలలో టాలెంట్ ఉన్న నటుల్లో కార్తికేయ కూడా మొదటి స్థానంలో ఉంటాడు అనడంలో అతిశయోక్తి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: