లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ అన్నిరంగాలకీ సడలింపులు ఇస్తున్న పరిస్థితులలో సినిమా షూటింగ్ లకు ఆతరువాత కొంత విరామంతో సినిమా ధియేటర్ల ఓపెనింగ్ కు ప్రభుత్వాల నుండి అనుమతులు రావడం ఖాయం అన్నసంకేతాలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు వచ్చేనెల నుండి ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అనుమతులు ఇచ్చి ఆతరువాత షరతులతో షూటింగ్ లకు కూడ లైన్ క్లియర్ చేస్తారని అంటున్నారు.


దీనితో చిన్నసినిమా దర్శక నిర్మాతల నుండి భారీ సినిమాల దర్శక నిర్మాతల వరకు వారి సినిమాల షూటింగ్ యాక్షన్ ప్లాన్ ను ఆలోచించే దిశలో ప్రస్తుతం చాలామంది బిజీగా ఉన్నట్లు టాక్. ఈపరిస్థితి ఇలా కొనసాగుతూ ఉంటే టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ టాప్ సీనియర్ హీరోలు అయిన చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జునలు షూటింగ్ లు తిరిగి ప్రారంభం అయిన వెంటనే తన సినిమాల షూటింగ్ లను మళ్ళీ ప్రారంభించదానికి అంతగా ఆసక్తి కనపరచడం లేదు అన్నగాసిప్పులు సందడి చేస్తున్నాయి.


ఇలాంటి లీకులు రావడం వెనుక ఒకకారణం ఉంది అని అంటున్నారు. ఈసీనియర్ హీరోలలో చిరంజీవి నాగార్జునలు ఇప్పటికే 60 సంవత్సరాల వయసును దాటిపోతే బాలకృష్ణ ఈసంవత్సరంతో 60లోకి అడుగుపెడుతున్నాడు. ఇక వెంకటేష్ వయస్సు కూడ ఇంచుమించు 60కి దరిదాపులోనే ఉంది. దీనితో ఈసినియర్ హీరోల సన్నిహితులు వీరిని వెంటనే షూటింగ్ లకు వెళ్ళకుండా మరి కొన్ని నెలలు ఆగి పరిస్థితులను అంచనా వేసుకుని కరోనాకు ఈసంవత్సరం చివరిలో వ్యాక్సిన్ వస్తుంది అన్నప్రచారం జరుగుతున్న పరిస్థితులలో ఆవిషయాలను తేలే వరకు ఆగవచ్చు కదా అంటూ సలహాలు ఇస్తున్నట్లు టాక్.


అయితే చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ లకు సంబంధించిన భారీ సినిమాలు నిర్మాణం మధ్యలో ఉన్న పరిస్థితులలో తమ సన్నిహితులు చెపుతున్న సలహాలను లేక్కచేయకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ తమ సినిమాలకు సంబంధించి రిస్క్ చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ‘ఆర్ ఆర్ ఆర్’ కు సంబంధించి విదేశీ నటీనటులు ఆప్రాజెక్ట్ లో ఉన్న పరిస్థితులలో వారంతా ఇప్పట్లో భారత్ కు షూటింగ్ కు రావడానికి అంగీకరించడం లేదనీ అదేవిధంగా కొంతమంది టాప్ హీరోయిన్స్  తాము నటించే సినిమాలకు ఇంటిమేట్ సీన్స్ లిప్ లాక్ సీన్స్ లో నటించే విషయంలో కూడ అనేక అభ్యంతరాలు చెపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో షూటింగ్ లు మొదలైనా భారీ సినిమాల నిర్మాణం అంత సజావుగా జరగక పోవచ్చు అంటూ కొందరి అభిప్రాయం..

మరింత సమాచారం తెలుసుకోండి: