తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వరకు ఏకంగా 150 కి పైగా సినిమాల్లో నటించి గుర్తింపు సంపాదించారు. అయితే ఇప్పటివరకు చిరంజీవి నటించిన చాలా సినిమాల్లో ఎన్నో సన్నివేశాలు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న విషయం తెలిసిందే.ఇక తెలుగు ప్రేక్షకులకు తమకిష్టమైన సన్నివేశాలు ఎన్నిసార్లు వచ్చినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే మెగాస్టార్ ఇటీవల నటించిన సినిమా సైరా నరసింహారెడ్డి. తొలి తెలుగు స్వతంత్ర సమర యోధుడు అయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్గా.... మొట్టమొదటి హిస్టారికల్ మూవీ గా నిలిచింది అనడంలో అతిశయోక్తి లేదు. 

 


 అయితే ఇది తెలుగు ప్రేక్షకులకి  తెలియని తొలి తెలుగు స్వతంత్ర సమరయోధులు కథ కావడం... ఈ సినిమాలో సైరా నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి  అద్భుతంగా నటించడం అన్ని  తెలుగు ప్రేక్షకుల మనసులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాయి  అని  చెప్పాలి. అయితే సైరా నరసింహారెడ్డి సినిమాలో  క్లైమాక్స్ ఫైట్  సీన్ మాత్రం ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం చేసే సమయంలో ఎంత  విరోచితంగా పోరాడారు  అనే విషయాన్ని స్పష్టంగా తెలుగు ప్రేక్షకులందరికీ కళ్ళకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు. 

 


 బ్రిటిష్ వారిపై దండెత్తిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి,.. బ్రిటిష్ వారిని ఒక్కొక్కరిని తెగ నరుకుతూ ఉంటే అది చూస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఇక చివర్లో చిరంజీవి యుద్ధం చేస్తున్న సమయంలో బ్రిటిషర్లు ఒక్కసారిగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నీ చుట్టుముట్టి.. తల నరికినప్పటికికూడా... బ్రిటిష్ వాళ్లని ఒక్కొక్కరిని తన ఖడ్గంతో తెగ నరుకుతూ ఉండడం తెలుగు ప్రేక్షకులు ఒక్కసారిగా రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది. ఇక ఈ పాత్రలో నటించిన చిరంజీవి ప్రాణం పెట్టి మరి పాత్రకు ప్రాణం పోశారు అని చెప్పడం లో అతిశయోక్తి లేదు. ఈ సన్నివేశం ఎన్నిసార్లు చూసినా తెలుగు ప్రేక్షకులకు గూస్ బమ్స్  వస్తూనే ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: