భారత దేశ సినీ చరిత్రలో ఎన్నో అద్బుతమైన చిత్రాలు సువర్ణాక్షరాలతో లిఖించారు.. అలాంటి చిత్రల్లో చేరింది దర్శకధీరుడు తెరకెక్కించిన ‘బాహుబలి, బాహుబలి2’.  ఐదేళ్ల పాటు కఠోర శ్రమతో ప్రభాస్, రానా లతో తీసిన బాహుబలి చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.  తెలుగోడి సత్తా ఏంటో జాతీయ స్థాయిలో తెలిపారు.  బాహుబలి, బాహుబలి 2 ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సంచలనాలు సృష్టించడమే కాదు.. అవార్డులు కూడా కైవసం చేసుకుంది. 'బాహుబలి' రెండు భాగాల తరువాత, భారత సినిమా ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేయడంతో పాటు, ఎన్నో దేశాల్లో అభిమానులను పెంచుకున్న హీరో ప్రభాస్.

IHG

తాజాగా రష్యాలోని సినీ ప్రేక్షకుల అభిమానాన్ని పొందడంతో, 'రష్యన్ ఆడియన్స్ హార్ట్' అవార్డు ప్రభాస్ కు లభించింది. ఒకప్పుడు తన అద్భుతమైన నటనతో లెజండరీ యాక్టర్ రాజ్ కపూర్, దాదాపు 30 సంవత్సరాల క్రితం ఇదే అవార్డును అందుకోగా, ఆపై మరే ఇండియన్ నటుడికీ దక్కని ఘనత ప్రభాస్ కు దక్కింది. 'శ్రీ 420', 'ఆవారా', 'ఆరాధన' వంటి చిత్రాలతో రష్యా సినీ అభిమానులను మెప్పించిన రాజ్ కపూర్, గతంలో ఇదే అవార్డును అందుకున్నారు.

IHG'Spent 7 Years On The Film' For ...

చాలా కాలం తర్వాత మళ్లీ రెబల్ స్టార్ ప్రభాస్ కి ఆ అద్భుతమైన అవకాశం దక్కింది. తాజాగా, 2015 అవార్డులను ప్రకటించగా, ప్రభాస్ కు అభిమానులను మెప్పించిన విభాగంలో అవార్డు లభించింది. ఇది 'బాహుబలి' చరిత్రలో మరో రికార్డుగా నిలువనుంది. ఈ సినిమాను చూసి ఆనందించవచ్చని ఈ సందర్భంగా అవార్డు కమిటీ వ్యాఖ్యానించింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా రెండు భాగాలు, కోట్లాది మందిని అలరించిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: