ఎక్కడ నెగ్గాలో.. ఎక్కడ తగ్గాలో తెలియాలంటారు. సురేంద్రరెడ్డి ప్రస్తుతం ఓ అడుగు వెనక్కి వేసి తగ్గాడా.. డెబ్యూమూవీ అతనొక్కడే మినహా.. ఆయన పెద్ద హీరోలనే డైరెక్ట్ చేశాడు. సైరా తర్వాత ఇద్దరు, ముగ్గురు స్టార్స్ ను అనుకున్నా.. వర్కవుట్ కాలేదు. అయితే.. మళ్లీ యంగ్ హీరోతో సినిమా ప్లాన్ చేస్తున్నాడట. 

 

సైరా రిజల్ట్ ఎలా ఉన్నా.. దర్శకుడిగా సురేంద్ర రెడ్డిని ఓ మెట్టు ఎక్కించింది. హిస్టారికల్ మూవీస్ కూడా తీయగలనని నిరూపించుకున్నాడు సురేంద్ర రెడ్డి. దీని తర్వాత పెద్ద రోల్ నే టార్గెట్ చేస్తూ.. కథలు ప్రిపేర్ చేసుకున్నాడు. రామ్ చరణ్.. మహేశ్.. ప్రభాస్ లాంటి హీరోల పేర్లు వినిపించాయి. 

 

సైరా తర్వాత సురేంద్ర రెడ్డి ప్రభాస్ తో సినిమా ప్లాన్ చేశాడు. కథ కూడా వినిపించాడు. ప్రభాస్ సినిమాపై ఆశలు పెట్టుకున్నాడు సురేంద్రరెడ్డి. అయితే దర్శకుడు చెప్పిన కథ హీరోకు నచ్చలేదట. ప్రభాస్ ప్రస్తుతం ఆల్ ఇండియా హీరో. బాహుబలి తీసుకొచ్చిన క్రేజ్ తో పాన్ ఇండియా సినిమాలు తప్ప మరో రకం చేయకూడదని డిసైడ్ అయ్యాడు. ఈ క్రమంలో సాహోలో నటించాడు. సినిమా ఫ్లాప్ అయినా.. హిందీలో 100కోట్లకు పైగా కలెక్ట్ చేసి అక్కడ హిట్ అనిపించుకుంది.  ఈ క్రమంలో ఇండియావైడ్ ఆడియన్స్ ను మెప్పించే కథను సురేంద్రరెడ్డి చెప్పలేకపోయాడట. 

 

స్టార్ హీరోలందరూ ఎవరికివాళ్లు కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు. వీళ్లనే నమ్ముకుంటే.. క్యాలెండర్ తో సంవత్సరాలు గిర్రున తిరిగిపోతాయన్న ఉద్దేశంతో.. తర్వాతి మూవీ కోసం సురేంద్రరెడ్డి రామ్ ను సంప్రదించాడట. కథ చెప్పాడని.. హీరో ఓకే అన్నాడని తెలిసింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ రెడ్ రిలీజ్ కు రెడీగా ఉంది. ఆ తర్వాత నటించే చిత్రంపై క్లారిటీ లేకపోయినా.. స్టైలిష్ డైరెక్టర్ బౌండెడ్ స్క్రిప్ట్ నచ్చితే.. ఈ కాంబినేషన్ ఓకే అవుతుంది. లేదంటే సురేంద్ర రెడ్డి మరో హీరోను చూసుకోవాల్సి ఉంటుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: