బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ఆ మద్య నటించిన హౌస్‌ఫుల్-4 చిత్రంలోని ‘బాల’ అనే పాటకు చిందులు వేశారు ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూతుళ్లు. గత కొంత కాలంగా తన డ్యాన్స్‌లు, సరదా వీడియోలతో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ సోషల్ మీడియా స్టార్ అయ్యాడు. ప్రపంచం మొత్తం లాక్ డౌన్ లో ఉంటే.. ఈ ఫ్యామిలీ మాత్రం అందరికీ మంచి ఎంట్రటైన్ మెంట్ ఇస్తూ వచ్చింది. తెలుగు, హిందీ పాటలకు భార్య, కూతుళ్లతో కలిసి డ్యాన్స్‌లు చేసి భారత అభిమానులను అలరించాడు. తాజాగా వార్నర్ కూతుళ్లు ఇడి రే, ఇవీ… తండ్రి లేకుండానే సొంతంగా ఓ బాలీవుడ్ పాటకు డ్యాన్స్ చేశారు.
అక్షయ్ కుమార్ హీరోగా నటించిన హౌస్‌ఫుల్-4 చిత్రంలోని ‘బాల’ అనే పాటకు చిందులేశారు. ఈ పాటపై ఆ చిన్నారుల డ్యాన్స్ చూస్తుంటే.. ఎంతో ముచ్చల వేస్తుంది. ముఖ్యంగా చిన్న కూతురు గంతులు భలే అనిపిస్తుంది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వార్నర్.. “కూతుళ్లు సొంతంగా డ్యాన్స్ చేయాలనుకున్నప్పుడు” అంటూ రాసుకొచ్చాడు. కాగా వార్నర్ గతంలోనే ఈ పాటకు డ్యాన్స్ చేయగా… అభిమానులు లైక్‌లు, కామెంట్ల వర్షం కురిపించారు. ఇప్పుడు మళ్లీ అతడి కూతుళ్లు ఇదే సాంగ్‌కు ఎంతో చూడముచ్చటగా స్టెప్పులు వేశారు.
View this post on InstagramWhen your daughters want to do their own bala dance 🤷🏼♂️🤷🏼♂️😂😂 #bala #dance #family