ఇలా తన జీవితం సాగుతూ ఉండగా ఒకసారి మా టీవీ యాజమాన్యం వారి దగ్గరనుండి ఫోన్ వచ్చింది, మీరు బిగ్ బాస్ సీజన్ 3 లో నటిస్తారా అని, అంతే ఇక అది మొదలు బిగ్ బాస్ షో లో రోజు రోజుకి పునర్నవి మాటలకు, తన ఆటిట్యూడ్ కు, హావభావాలకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. ఇదంతా ఒక ఎత్తయితే బిగ్ బాస్ లో ఈమెకు సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కు మద్యన జరిగిన ఒక అందమైన స్నేహమో, ప్రేమో లేక ఇంకేదో, ప్రేక్షకులకు చాలా బాగా కనెక్ట్ అయింది. అంతే ఇక పునర్నవి కోసం ప్రేక్షకలోకం తాను ఎలిమినేషన్ లో ఉన్న ప్రతిసారీ పోటీపడి మరీ ఓట్లు వేసి తనను సేవ్ చేసే వారు. బిగ్ బాస్ తర్వాత తనకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. పునర్నవి జీవితం యూ టర్న్ తీసుకునే రోజులు దగ్గరపడ్డాయి అనే వార్తలు సినీలోకంలో వైరల్ అవుతున్నాయి.
బిగ్ బాస్ తో పాపులర్ అయిన పునర్నవికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశం దొరికిందని వార్త ఇప్పుడు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. పవర్ స్టార్ తో నటించడానికి ఎంతోమంది పెద్ద హీరోయిన్లు క్యూ కడుతుంటే పునర్నవి ఈ ఛాన్స్ కొట్టేసిందంటూ వార్తలొస్తున్నాయి. ఇదంతా బిగ్ బాస్ షో మరియు రాహుల్ సిప్లిగంజ్ పుణ్యమే అంటున్నారు ఈ వార్తలు విన్న ఆమె అభిమానులు. ఇంతకీ అ సినిమా మరేదో కాదు పవన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అయిన "విరూపాక్ష". పవన్ తరువాత చిత్రానికి ఈ టైటిల్ ను ఖరారు చేసారు. ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జాక్వెలిన్ పెర్నాండెజ్ హీరోయిన్ కాగా మరొక కీలక పాత్రకోసం పునర్నవి అయితే సరిపోతుందని చిత్రబృందం భావిస్తున్నట్లు గాసిప్ హడావిడి చేస్తుంది. ఈ వార్తలో ఎంత మాత్రం నిజముందో తెలియాలంటే అధికారక వార్త కోసం వేచిచూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి