తరచూ ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడే అమితాబ్‌కు విల్ పవర్ ఎక్కువ. ఏడు పదులు దాటినా.. వరుసపెట్టి సినిమాలు చేసేస్తాడు. ఆయనకు కరోనా సోకిన వార్త అభిమానులనే కాదు.. అందరినీ భయపెట్టింది. ఈ వయసులో కోలుకుంటారో లేదో అనే అనుమానం కొందరిలో ఉండేది. కరోనాను అలవోకగా జయించాడో లేదో.. కెమెరాముందు నుంచొని రెడీ అనేశాడు. అమితాబ్‌కు గౌరవం తీసుకొచ్చిన కౌన్ బనేగా కరోడ్‌పతి షో షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా నడుస్తోంది.
కౌన్ బనేగా కరోడ్‌పతి షో గురించి అమితాబ్ తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు. ఈ షో యూనిట్‌తో కలిసి పనిచేయడం మధురమైన అనుభవమన్నారు. షో షూట్‌ను మొదలుపెట్టాం. చేయాల్సిన ఎపిసోడ్స్ చాలా ఉన్నాయి. రోజుకు 12 నుంచి 14 గంటలకు పనిచేస్తున్నట్టు చెప్పారు అమితాబ్.
వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు. దీన్ని తూచ తప్పకుండా పాటిస్తున్నారు అమితాబ్. 77 ఏళ్ల వయసులో రోజుకు 14 గంటలు షూటింగ్‌లో పాల్గొనడం .. అందులోనూ కోవిడ్ సమయంలో పాల్గొనడం అంటే మాటలు కాదు. ప్రస్తుతం నటిస్తున్న ‘చెహ్రే’, ‘బ్రహ్మాస్త్ర’ షూటింగ్ మొదలయ్యేలోగా.. కౌన్ బనేగా కరోడ్‌పతి ఎపిసోడ్స్ పూర్తి చేయాలనే పట్టుదలతో బిగ్ బి ఉన్నాడు.
మొత్తానికి అమితాబ్ వయసుకు మించిన పనులు చేస్తూ.. ఆశ్చర్యపరుస్తున్నాడు. సాధారణంగా డెబ్బై ఏళ్లు దాటిన వారు ఏ చిన్న పని చేసినా.. అలసిపోతారు. ఎక్కువ శాతం విశ్రాంతి తీసుకోవడానికే ప్రాధాన్యత ఇస్తారు. అలాంటిది బిగ్ బీ మాత్రం పనికి ప్రాధాన్యత ఇస్తూ.. విశ్రాంతికి తక్కువ సమయం కేటాయిస్తున్నాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి