హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తో నిర్మాత చిన బాబు ఎలాంటి ఫిల్మీ వండర్స్  తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాడో చూస్తూనే ఉన్నాం. కుమారుడు నాగవంశీని ప్రొడ్యూసర్ గా పెట్టి సితార ఎంటర్ టైన్ మెంట్  రన్ చేస్తున్నారు. మొన్నటివరకు ఈ బ్యానర్లో వచ్చే సినిమాలలో హీరోలుగా మెగా అండ్ కో బ్యాచ్ మాత్రమే ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే తాజా లెక్కలతో అవన్ని ఒట్టి ట్రాష్ అని  తెలిసిపోయింది.

తెలుగు సినీ పరిశ్రమలో ఈ మధ్యకాలంలో వరుస విజయాలు అందుకుంటూ ముందుకు సాగిపోతోన్న నిర్మాతలలో మనకు చినాబాబు కనిపిస్తారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో టై అప్ అయిన దగ్గరినుంచి ఈయన బ్యానర్లో వచ్చే సినిమాలకు మార్కెట్లో డిమాండ్ పెరిగింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అంటే చాలు డిస్ట్రిబ్యూటర్లు సినిమాలు కొనే స్థాయికి వెళ్లిపోయారు. త్రివిక్రమ్ చేసే వరుస సినిమాలు ఈ బ్యానర్లోనే వస్తూ ఉండడంతో అటు మెగా కాంపౌండ్ మనిషిగాను నోటెడ్ అయిపోయారు.

ఒకవైపు హారిక అండ్ హాసినీ బ్యానర్లో చినబాబు వరుస సినిమాలు చేస్తూ ఉండగా మరో వైపు కుమారుడు నాగవంశీతో సితార్ ఎంటర్ టైన్ మెంట్ పెట్టించి అక్కడా సక్సెస్ లు అందుకోవడం షురూ చేశారు. త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ లకు అనుకూలంగా ఉండే హీరోలతోనే సితార వారు సినిమాలు చేస్తారనే అపవాదు ఆ మధ్య వచ్చింది. అందుకు తగ్గట్లుగానే వీరి బ్యానర్లో చేసే హీరోలు ఆయా కాంపౌండ్ లకు మద్దతుదారులు కావడంతో ఈ కామెంట్స్ కు బలం చేకూరింది. నితిన్ కు నిన్న భీష్మ,నేడు రంగ్ దే సినిమాలిచ్చి ఇలా  ఎంకరేజ్ చేస్తున్నారు అనేవారు ఉన్నారు.

ఎన్ని కామెంట్స్ ఉన్నప్పటికీ  న్యూ టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ.... ఈ బ్యానర్ ఎప్పటికఫ్నుడు ఫ్రెష్ ఫిలింస్ అందిస్తుంటుంది. అలాంటిదే తాజాగా  మరో కొత్త దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తోంది.సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో విమల్ కృష్ణ అనే డైరెక్టర్ తో ఓ సినిమా తెరకెక్కించబోతున్నట్లు  ప్రకటించారు.






మరింత సమాచారం తెలుసుకోండి: