ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... ‘బాహుబలి'(సిరీస్) తో ప్రభాస్ క్రేజ్ పెరిగిందనేది వాస్తవమే..! కానీ ‘అందులో ప్రభాస్ గొప్పతనమేమి లేదు.. అంతా రాజమౌళి చలవే’ అని హేళన చేసే వాళ్ళు కూడా లేకపోలేదు. ఎంత స్టార్ హీరో అయినా.. ఐదేళ్ళు ఓ సినిమా కోసం పనిచెయ్యడం.. ఆ సినిమా పేరుని పదే పదే ప్రస్తావించి… మిగిలిన సినిమాలను ప్రమోట్ చేసుకోవడం ప్రభాస్ కు తెలీదు. అందుకే అతనికి మరింత ఫ్యాన్ ఫోలోలింగ్ పెరిగింది. బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం ప్రభాస్ క్రేజ్ ను చూసి జలసీ ఫీలయ్యే రోజులు వచ్చాయి.

‘బాహుబలి’ అనే సినిమాలో ప్రభాస్ క్రెడిట్ లేదు అనుకున్న వాళ్ళు.. ‘సాహో’ కలెక్షన్స్ చూసి నోర్లు వెళ్ళపెట్టారు కూడా..! పోనీ అది పూర్తిస్థాయిలో హిట్ సినిమానా అంటే అదీ కాదు. కేవలం ప్రభాస్ అనే బ్రాండ్ తోనే.. ‘సాహో’ సినిమా భారీగా కలెక్షన్లను రాబట్టింది. అదే సూపర్ హిట్ టాక్ వచ్చి ఉంటే కనుక.. దగ్గర దగ్గరలో ‘బాహుబలి'(సిరీస్) తో సమానంగా కలెక్ట్ చేసి ఉండేది అనడంలో కూడా అతిశయోక్తి లేదు. సరే ఈ విషయాలన్నీ పక్కన పెట్టేస్తే.. శుక్రవారం  ప్రభాస్ పుట్టినరోజు జరిగింది. ఏ స్టార్ హీరో పుట్టినరోజు అయినా..

ముందు రోజు సాయంత్రం నుండీ ట్విట్టర్లో ఫ్యాన్స్ హడావిడి మొదలవుతుంది. కానీ పుట్టినరోజు ముందు రోజు సాయంత్రం నుండీ ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్లో చాలా మంది సినీ సెలబ్రిటీలు కూడా ప్రభాస్ కు అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే విషెస్ చెబుతూ #happybirthdayprabhas హ్యాష్ ట్యాగ్ ను ఇండియా వైడ్ ట్రెండ్ చెయ్యడం విశేషం. ప్రభాస్ పుట్టినరోజు నాడు  అయితే ట్విట్టర్లో.. అదీ సౌత్లోనే అత్యధిక ఫాలోవర్స్ ను మరియు ప్రపంచవ్యాప్తంగా  కోట్లాది మంది అభిమానులను కలిగి వున్న   స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ప్రభాస్ కు బర్త్ డే విషెస్ చెబుతూ ట్వీట్ చేసాడు. దానిని బట్టి ‘సాహో’ ఫ్లాప్ అయినా ప్రభాస్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని స్పష్టమవుతుంది.




మరింత సమాచారం తెలుసుకోండి: