నిర్మాత బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుందని ప్రతీ ఒక్కరూ డైలాగ్స్ చెబుతారు హీరోలు. దర్శకులు అయితే స్టేజ్ ఎక్కినప్పుడు ప్రొడ్యూసర్ గురించి ఒక రేంజ్ లో చెబుతుంటారు. మరి రియాలిటీలో ఇదే పిక్చర్ కనిపిస్తుందా.. నిర్మాతల గురించి ఆలోచిస్తున్నారా.. కష్టకాలంలో వారికి అండగా నిలుస్తున్నారా అంటే అన్నీ ప్రశ్నలే కనిపిస్తున్నాయి.

కరోనాతో ఇండస్ట్రీ నష్టాల్లోకి వెళ్లాక హీరోలు, డైరెక్టర్లు రెమ్యునరేషన్ లు తగ్గించుకోవాలని చాలా మంది నిర్మాతలు రిక్వెస్ట్ చేస్తున్నారు. బడా ప్రొడ్యూసర్ డి.సురేష్ బాబు కూడా స్టార్ హీరోలు రెమ్యునరేషన్ తగ్గించుకుంటే నిర్మాతలకు హెల్ప్ అవుతుందని చెప్పాడు. యాక్టివ్ తమిళ్ ప్రొడ్యూసర్స్ ప్రెసిడెంట్ భారతీరాజా కూడా హీరోలు, హీరోయిన్ లు, దర్శకులు 30శాతం వరకు రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని కోరాడు.

సినిమా హిట్ అయితే రెమ్యునరేషన్ లు పెంచుకునే హీరోలకు, ఇలాంటి కష్టకాలంలో తగ్గాలని తెలియదా.. నిర్మాతల పెట్టుబడితో స్టార్డమ్ అందుకునే స్టార్లు, రెమ్యునరేషన్ తగ్గించుకుంటే వాళ్ల స్టేటస్ పడిపోతుందా.. అయినా ఇండస్ట్రీ కష్టాలను దగ్గర నుంచి చూస్తోన్న హీరోలకు మరొకరు చెప్పాలా.. ఇంతమంది రిక్వెస్టులు చేయాలా.. శాలరీస్ తగ్గించుకోవాలని వాళ్లకు ఆలోచన రాదా అని విమర్శలు చేస్తున్నారు నెటిజన్లు.

తెలుగులో పవన్ కళ్యాణ్ లాంటి టాప్ హీరోలు 40కోట్ల వరకు తీసుకుంటున్నారు. ఇక తమిళ్ లో అయితే రజినీకాంత్, విజయ్ లాంటి హీరోలు 100కోట్ల వరకు చార్జ్ చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్లకు ఇన్ని కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చ, భారీగా సినిమాలు తీయడం చాలా కష్టం. అందుకే టాప్ హీరోలు రెమ్యునరేషన్లు తగ్గించుకొని మిగతా వాళ్లను ఇన్ స్పైర్ చేయాలని.. నిర్మాతలకు అండగా ఉండాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. మొత్తానికి కరోనాతో సినిమా ఇండస్ట్రీ నష్టాల్లోకి కూరుకుపోయింది.

మొత్తానికి కరోనాతో సినిమా ఇండస్ట్రీ నష్టాల్లోకి కూరుకుపోయింది. ఇలాంటి క్లిష్టసమయంలో హీరోలు, డైరెక్టర్లు పారితోషికం తగ్గించుకోవాలని ప్రొడ్యూసర్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. చూద్దాం.. నిర్మాతల అభ్యర్థనలు హీరోలు, డైరెక్టర్స్ పట్టించుకుంటారో లేదో.





మరింత సమాచారం తెలుసుకోండి: