బిగ్ బాస్ హౌజ్ లో మంగళవారం టాస్క్ లో భాగంగా హౌజ్ మేట్స్ ను బిబి డే కేర్ టాస్క్ ఇచ్చాడు. హౌజ్ లో ఉన్న 11 మంది హౌజ్ మేట్స్ లో కొందరిని పిల్లలుగా మార్చి.. మరికొందరిని వారికి కేర్ టేకర్స్ గా చేయమని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు. అయితే ఈరోజు టాస్క్ లో చిన్నపిల్లల్లా అరియానా, అవినాష్, మెహబూబ్, హారిక, అమ్మా రాజశేఖర్ చేశారు. ఇక కేర్ టేకర్స్ గా అభిజిత్, నోయెల్, మోనాల్, సోహెల్ చేశారు.

ఈ టాస్క్ కు సంచాలకునిగా లాస్య చేస్తుంది. చిన్న పిల్లల్లా చేయడం వరకు బాగానే ఉన్నా కేర్ టేకర్స్ కు మాత్రం వీరు చేస్తున్న అల్లరి భరించలేని విధంగా ఉంది. వారు ఒక్కొక్కరు కష్టంగా ఫీల్ అవుతున్నారు. నోయెల్, అభిజిత్ అయితే అయ్య బాబోయ్ అనేశారు. ఈ టాస్క్ లో గెలిచిన వారికి స్పెషల్ సర్ ప్రైజ్ ఉంటుందని అన్నాడు బిగ్ బాస్. అందుకే ఈ టాస్క్ లో అందరు తమ ఉత్తమ ప్రదర్శన చూపిస్తున్నారు. ఇక చిన్నపీల్లలా అరియానా, హారిక ఆట బాగుంది.

అవినాష్ కూడా ఆకట్టుకుంటున్నాడు. మెహబూబ్ కూడా చిన్నపిల్లాడిగా ఉంటూ తన కేర్ టేకర్ అఖిల్ ను ఓ ఆట ఆడుకుంటున్నాడు. తనని నామినేట్ చేసిన సోహెల్ మీద ఈ రకంగా పగ తీర్చుకుంటుంది అరియానా. ఫైనల్ గా ఈరోజు ఎపిసోడ్ లో బిబి డే కేర్ టాస్క్ అలరించింది. అయితే అరియానా తన పెన్సిల్ తీసుకుందని హారికతో గొడవ పడి మరి తీసుకుంది.  దానికి హారిక కొద్దిగా ఫీల్ అయినట్టు తెలుస్తుంది.                                             

మరింత సమాచారం తెలుసుకోండి: