టాలీవుడ్ లో రాజమౌళి సినిమా అనగానే చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది ఏంటి అనే దానిపై ప్రతి ఒక్కటి కూడా ఆసక్తికర చర్చలు జరుగుతూ ఉంటాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆధారంగా చూస్తే రాజమౌళి సినిమాల విషయంలో గతంలో మాదిరిగా పరిస్థితులు లేవు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. అయితే రాజమౌళి మాత్రం ఇప్పుడు కాస్త ఎక్కువగా తన సినిమాల మీద దృష్టి పెట్టారని ప్రచారం జరుగుతుంది. అసలు ఏంటి కదా అనేది ఒకసారి చూస్తే గతంలో రాజమౌళి భారీ బడ్జెట్ సినిమాలను ఎక్కువగా తీసుకువచ్చే ప్రయత్నం చేసేవారు.

దీనివలన నిర్మాతలకు కూడా కాస్త ఎక్కువగా భారం పడేది. సినిమా మీద లాభాలు వచ్చినా సరే కొంతమంది నిర్మాతలు మాత్రం సినిమాకు ఖర్చు పెట్టే విషయంలో కాస్త భయపడే పరిస్థితి ఉండేది. ఇక ఈ కరోనా సమయంలో సినిమాకు భారీగా ఖర్చు చేస్తే అనవసరంగా ఇబ్బందులు వస్తాయి అనే భావనలో చాలా మంది నిర్మాతలు ఉన్నారు. ఇదే విషయాన్ని రాజమౌళి కి కూడా కొంత మంది నిర్మాతలు చెప్పినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా రాజమౌళి మహేష్ బాబు సినిమా విషయంలో ఇప్పుడు కొంతమంది నిర్మాతలు ఆయనకు కొన్ని సూచనలు కూడా చేశారట.

సినిమా బడ్జెట్ ఎక్కువగా ఉంటే అనవసరంగా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుందని చెప్పినట్లుగా సమాచారం. అందుకే ఈ సినిమా బడ్జెట్ విషయంలో దాదాపు వంద కోట్ల వరకు మాత్రమే పెట్టుబడి పెట్టాలని భావించారట. అయితే హీరో రెమ్యూనరేషన్ దాదాపుగా 30 నుంచి 40 కోట్ల వరకు ఉంటుంది. ఇక రాజమౌళి కూడా దాదాపు 40 కోట్ల వరకు తీసుకునే అవకాశం ఉంటుంది. మిగిలిన 20 కోట్లతో సినిమాను పూర్తి చేయడం అనేది దాదాపు సాధ్యం కాదు. అయితే ఇప్పుడు రాజమౌళి కాస్త వెనక్కు తగ్గి తన రెమ్యునరేషన్ను తగ్గించుకొనే విధంగా ఆయన ప్లాన్ చేస్తున్నారట. అయితే సినిమాకు లాభం వస్తే మాత్రం తీసుకునే విధంగా ప్లాన్ చేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: