బిగ్ బాస్ షో మొదటి సీజన్ కొత్త కాబట్టి దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. అందుకే సీజన్ 1 ప్రతి టాస్క్ ను బాగా ఎంజాయ్ చేశారు ఆడియెన్స్. అయితే సీజన్లు వస్తున్నా కొద్దీ షో మీద ఉన్న ఆసక్తి తగ్గుతుంది. ఇక ఇదిలాఉంటే హౌజ్ లో వెళ్లి ఆడే కంటెస్టంట్స్ కన్నా బయట ఉన్న వారి సోషల్ మీడియా టీం ఆట ఆడాలని ఫిక్స్ అయ్యారు. హౌజ్ లోపల వారు చేసే ప్రతి పని గురించి సోషల్ టీం వారిని పొగుడుతూ వారి ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగేలా చేస్తుంది.

నిజం చెప్పాలంటే కొన్ని టీం కు కేవలం ఒక హౌజ్ మేట్ గెలవాలని మిగతా హౌజ్ మేట్స్ ను కావాలని టార్గెట్ చేస్తున్నారని తెలుస్తుంది. హౌజ్ లో ఉన్న కంటెస్టంట్స్ తిట్టుకుంటే ఈ సోషల్ మీడియా టీం వార్ ను వన్ సైడ్ చేసి అవతల వైపు ఉన్న కంటెస్టంట్ ను టార్గెట్ చేస్తుంది. అయితే అవతల ఉన్న కంటెస్టంట్ కు ఇలాంటి టీం ఉంటే సరే లేదంటే మాత్రం చుక్కలు చూపిస్తారు.

బిగ్ బాస్ ఎలిమినేషన్ అనేది ఓటింగ్ విధానంతో జరుగుతుంది. అయితే కొందరు కావాలని ఒకరిద్దరిని టార్గెట్ చేసి ఓటింగ్ పర్సెంటేజ్ కూడా తగ్గించేస్తారని అంటున్నారు. అయితే ఎవరేం చేసినా సరే బిగ్ బాస్ దగ్గర ఆ పప్పులు ఉడకవని కొందరు అంటున్నారు. సోషల్ మీడియా హంగామా ఎంత చేసినా సరే ప్రేక్షకులు మనసు గెలిచిన హౌజ్ మేట్ నే విజేతగా గెలిపిస్తారని అంటున్నారు.                                                                        

మరింత సమాచారం తెలుసుకోండి: