గత 8 నెలలుగా తెలుగు రాష్ట్రాలలో మూతపడిన ధియేటర్లు ఎప్పుడు తిరిగి ఓపెన్ అవుతాయో ఇప్పటికీ స్పష్టంగా ఇండస్ట్రీ ప్రముఖులు చెప్పలేకపోతున్నారు. వాస్తవానికి ధియేటర్స్ ఓపెనింగ్ కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాల నుండి అనుమతులు వచ్చినప్పటికీ ఇండస్ట్రీ పెద్దల నుంచి ఇప్పటికీ సరైన స్పందన లేదు.


మొదట్లో ధియేటర్లను డిసెంబర్ 4 నుంచి ఓపెన్ చేస్తారు అని భావించారు. అయితే ఇప్పుడు ఆ డేట్ ను డిసెంబర్ 11కు వాయిదా వేసినట్లు లీకులు వస్తున్నాయి. క్రిస్మస్ సీజన్ కు కొంచెం ముందుగా ధియేటర్లను ఓపెన్ చేస్తే నెమ్మదిగా జనం ధియేటర్లకు రావడానికి అలవాటుపడి సంక్రాంతి సీజన్ కు తిరిగి ధియేటర్లు కళకళలాడుతాయి అన్నది ఇండస్ట్రీ పెద్దల వ్యూహం అని అంటున్నారు.


అయితే జనాలు థియేటర్ కు అలవాటు పడాలి అంటే సరైన సినిమా ఒకటి రావాలి. కానీ పెద్ద హీరోలు ఎవరు తమ సినిమాలను సంక్రాంతిలోపు విడుదల చేయడానికి ఆశక్తి కనపరచడం లేదు. దీనితో సాయి తేజ్ హీరోగా నటించిన ‘సోలో బతుకే సో బెటరు’ సినిమాను విడుదల చేసే ఆలోచనలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా హక్కులు జీ టీవీ కి అమ్మేసారు.  


థియేటర్ హక్కులు కూడా జీ టీవీ వద్దనే ఉన్నాయి. అందుకే జీ టీవీతో మాట్లాడి ఈ సినిమాను స్మూత్ గా థియేటర్ లోకి వదిలే ప్రయత్నాలను ఇండస్ట్రీ పెద్దలు చేస్తున్నట్లు టాక్. వాస్తవానికి  జీ టీవీకి థియేటర్ లేదా డిస్ట్రిబ్యూషన్  నెట్ వర్క్ లేదు. అందుకే ఇండస్ట్రీకి సంబంధించిన ఆ నలుగురు సాయి తేజ్ సినిమా విడుదలకు సహకరించి అసలు జనం ధియేటర్లకు ఎలా వస్తారు అన్నవిషయం ప్రయోగాత్మకంగా చూస్తారు అని తెలుస్తోంది. దీనికితోడు గతంలో ఓటిటిలో విడుదలై వందరోజుల దాటిన సినిమాలను కూడ డిసెంబర్ లో ధియేటర్లలో విడుదల చేస్తారని తెలుస్తోంది. ఇలా ఇండస్ట్రీ వర్గాలు చేస్తున్న రకరకాల ప్రయోగాలకు సాయి తేజ్ మూవీ ఒక పైలెట్ గా మారుతోంది అనుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: