ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..లాక్ డౌన్  సమయంలో థియేటర్ లు లేక అల్లాడిపోతున్న జనాలకు ఇంకా  మూవీ లవర్స్‌కి వినోదాన్ని పంచింది ఓటీటీ. ఆహా, అమేజాన్ ప్రైమ్, హాట్ స్టార్ వంటి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ద్వారా చాలా సినిమాలు విడుదలయ్యాయి. ఇక ఓటీటీకి మంచి ఆదరణ లభించడంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఏటీటీ.ఈ ప్లాట్ ఫామ్ లకి బాగా అలవాటు పడిపోయారు జనాలు..ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రాజు తెరకెక్కించిన రొమాంటిక్ మూవీ డ‌ర్టీ హ‌రి. రుహాని శ‌ర్మ‌, శ్ర‌వ‌ణ్ రెడ్డి, సిమ‌త్ర కౌర్ త‌దిత‌ర‌లు న‌టించిన ఈ సినిమా టీజ‌ర్ కి సోష‌ల్ మీడియాలో మంచి  ఆద‌ర‌ణ ల‌భించింది. ఈ నేప‌థ్యంలో డ‌ర్టీ హ‌రి చిత్రాన్ని ఓ కొత్త ఓటిటి ద్వారా డిసెంబ‌ర్ 18న విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.


ఇప్పటికే జనాలు  ఓటిటిల్లో విడుద‌ల అవుతున్న సినిమాల్ని ఎక్కువగా ఆద‌రిస్తున్నారు, దీంతో కొంద‌రు సినీ ప్రముఖలు ఈ ఏటీటీని తీసుకు రాబోతున్నారు, ఇందులో తొలి సినిమాగా డ‌ర్టీ హ‌రీని ప్ర‌ద‌ర్శించ‌బోతున్నారు. పే ఫర్ వ్యూ పద్దతిలో నడిచే ఈ కొత్త ఏటీటీ యాప్ కు తెలుగు ఆడియెన్స్ లో ప్రత్యేక స్థానం ఉంటుందని అంతా చాలా బలంగా నమ్ముతున్నారు.డర్టీ హరి చిత్రంతో పాటు ఇంకా పలు సినిమాలు ఈ కొత్త ఏటీటీ స్ట్రీమింగ్ అవ్వబోతున్నాయి. ఫోన్ కాల్ చేసి సినిమా చూసే నూత‌న‌ విధానంను ఈ కొత్త ఏటీటీ రెడీ అవుతుంది.


ఈ ఏటిటి కి ఇద్ద‌రు పెద్ద ద‌ర్శ‌కులు ప‌నిచేయ‌టం విశేషం, వారే ఈ యాప్ ని యూజ‌ర్ ఫ్రెండ్లీగా సిద్ధం చేశారు. ఈ ఏటిటి డిసెంబర్ 18న లాంచ్ చేస్తున్నారు డిసెంబ‌ర్ మెద‌టి వారం లో దీని గురించి అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది. ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. మరెన్నో అప్ డేట్స్ తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: