సన్నీ లియోన్, ఇమ్రాన్ కలిసి బాద్‌షాహో మూవీలో ఒక సాంగ్‌లో నటించగా.. వీళ్లిద్దరిని తల్లిదండ్రులను చేసేశాడు ఓ బీహారీ. కుందన్ కుమార్ అనే 20 ఏళ్ల కుర్రాడు బీఏ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఎగ్జామ్ హాల్ టిక్కెట్‌లో తల్లి పేరు దగ్గర సన్నీ లియోన్ అని.. తండ్రి కాలమ్‌లో ఇమ్రాన్ హష్మీ అని రాశాడు. సన్నీ కొడుకంటూ... ఈ అప్లికేషన్ నెట్‌లో వైరల్ అయింది.
తుంటరి పని చేసిన కుందన్‌కుమార్‌పై చర్యలు తీసుకుంటామని యూనివర్సిటీ అధికారులు పేర్కొన్నారు. అయితే.. ఈ ఎగ్జామినేషన్ ఫామ్ సన్నీలియోన్ కంట పడింది. ఈ కుర్రోడు చేసిన పనికి సరదాగా నవ్వుకొని.. అద్భుతం అంటూ అతగాడిని మెచ్చుకుంది. పెద్ద పెద్ద కలలు కను అంటూ చమత్కరించింది.
బిహారీ కుర్రాళ్ల మనసులో సన్నీలియోన్ నిలిచిపోయింది. ఇలా తుంటరి పనులు వాళ్లకే సాధ్యం. గతంలో ఇలాగే.. సన్నీలియోన్ ఎగ్జామ్‌లో టాపర్‌గా నిలిచిందని.. కోల్‌కతాలోని కాలేజ్‌లో సీట్ వచ్చిందన్న కథనాలు సృష్టించారు బిహారీ యూత్. దీనిపై కూడా ఫన్నీగా స్పందిస్తూ.. మీ అందరినీ కాలేజీలో కలుస్తానని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సన్నీలియోన్. మొత్తానికి సన్నీలియోన్ కు 21ఏళ్ల కొడుకు ఉన్నాడంటూ పెద్ద పుకారే రేగింది. ఆమె గురించి నెట్టింట్లో గాసిప్స్ పుట్టుకొచ్చాయి. ఏమని సన్నీ, ఇమ్రాన్ కలిసి ఒక మూవీ సాంగ్ లో నటించారో గానీ అదే అదునుగా తీసుకొని వాళ్లను తల్లిదండ్రులను చేసుకున్నాడు ఓ బీహారీ యువకుడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి