దీంతో బుల్లితెర ప్రేక్షకుల తో పాటు మెగా అభిమానులు కూడా గ్రాండ్ ఫినాలే కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక బిగ్ బాస్ ఫైనల్ అంకానికి రావడంతో ఎప్పటిలాగానే మొదటినుంచి బిగ్ బాస్ హౌస్ లో ఉండి క్రమక్రమంగా ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరూ కూడా వచ్చి అందరితో సందడి చేశారు అన్న విషయం తెలిసిందే. మొదట మోనాల్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం తో ఇక హౌస్ మొత్తం కళకళలాడిపోతోంది. ఇక ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఎవరూ లోపలికి రాకుండా గ్లాస్ ని అడ్డుపెట్టగా మాజీ కంటెస్టెంట్ లు బయటినుంచి హౌస్ లోని వారితో ఇంటరాక్ట్ అవుతూ సందడి చేశారు.
అయితే రీ యూనియన్ లో ముగ్గురు మాజీ కంటెస్టెంట్ లు మాత్రం కనిపించడం లేదు. బిగ్ బాస్ 4 సీజన్ లో కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన అమ్మరాజశేఖర్,సూర్య కిరణ్, దేవి నాగవల్లి ను రీ యూనియన్ కు రాలేదు. ఈ ముగ్గురు కంటెస్టెంట్ లు ఎందుకు బిగ్ బాస్ రీ యూనియన్ కి రాలేదు అన్నదానిపై ప్రస్తుతం అభిమానుల్లో చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే ఈ ముగ్గురికి సంబంధించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎలిమినేట్ అయిపోయిన తర్వాత దర్శకుడు సూర్య కిరణ్ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల రీ యూనియన్ కి రాలేదట. గ్రాండ్ ఫినాలే కి మాత్రం తప్పకుండా హాజరవుతానని నిర్వాహకులతో చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది.
మరోవైపు వృత్తిరీత్యా బిజీగా ఉండటం కారణంగా దేవి నాగవల్లి కూడా రీ యూనియన్ కు రాలేనని చెప్పారట. ఇద్దరి మాట అటుంచితే హౌస్ లో ఎన్నో రోజుల పాటు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన డాన్స్ మాస్టర్ అమ్మరాజశేఖర్ రాకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హౌస్ లోకి వెళ్ళిన తర్వాత మాస్టర్ ముఖ్యంగా అభిజిత్ అఖిల్ అంటే పెద్దగా ఇష్టపడేవారు కాదు. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా అమ్మ రాజ శేఖర్ మాస్టర్ ఇద్దరూ బిగ్బాస్ కి అర్హులు కాదు అంటూ పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం ఈ ఇద్దరు కూడా టాప్ ఫైవ్ లో ఉన్నారు. అందుకే ప్రస్తుతం రీయూనియన్ కోసం అమ్మ రాజశేఖర్ మాస్టర్ రాలేదు అన్న టాక్ వినిపిస్తుంది. ఇది ఎంతవరకు నిజం అన్నది చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి