ఇంతకీ ఎవరా కుర్రాడు అంటే..." శంకర్‌దాదా ఎంబీబీఎస్'లో అచేతనంగా కుర్చీలో కనిపించే కుర్రాడు శ్రీరామచంద్రమూర్తిని మరచిపోవడం ఎవరితరమూ కాదు. సినిమాలో సీరియస్‌నెస్ తెచ్చిన ఎలిమెంట్స్‌లో శ్రీరామచంద్రమూర్తి ఎపిసోడ్ ఒకటి. సినిమా ఆఖరులో అందరి మనసుల్ని బరువెక్కించే పాత్ర అది. ఆ పాత్రలో నటించిన కుర్రాడిని అప్పుడు చూసి… ఈ ముఖంలో 'మెగా' కళ కనిపిస్తోంది అని అనుకున్నారు. అయితే మెగాస్టార్ సినిమా కదా ఎవరిని చూసినా అలానే అనిపిస్తుంది అని వదిలేశారు.అయితే ఆ పాత్రలో నటించి మెగా ఇంటి కుర్రాడే.ఆ బుడ్డోడు మరెవరో కాదు.. మన మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు అయిన వైష్ణవ్ తేజ్..
'ఉప్పెన' సినిమాతో టాలీవుడ్‌కు హీరోగా పరిచయమవుతున్నాడు వైష్ణవ్.. ఇప్పటికే ఈ సినిమా పాటలకి విశేష స్పందన లభించింది.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు కూడా రాబోతోంది ఈ సినిమా.. ఈ సినిమా తర్వాత క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో ఏకంగా రకుల్ ప్రీత్ సింగ్ తో రొమాన్స్ చేస్తున్నాడు వైష్ణవ్ తేజ్..ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ కి జోడిగా నటిస్తోంది రకుల్ ప్రీత్..ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపు లాక్ డౌన్ లోనే పూర్తయినట్లు సమాచారం...!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి