ఎన్ని సంక్రాంతి పండగలొచ్చినా ఈ సంక్రాంతి మాత్రం సినీ జనాలకు సమ్ థింగ్ స్పెషల్ అని చెప్పాలి.. ఎందుకంటే థియేటర్లు మూతపడి తొమ్మిది నెలలు అయిపోయింది.. ప్రేక్షకులు థియేటర్లకు చాలావరకు దూరమైపోయారు. ఇక భవిష్యత్ లో వస్తారో రారో అన్న పరిస్థితి నెలకొంది.. మరోవైపు OTT ప్లాట్ ఫామ్ లు మంచి మంచి సినిమాలతో వీక్షకులను ఆకర్షిస్తున్నాయి... వీటికి తోడు పైరసి బెడద ఇంకా తీరనే లేదు.  ఇలాంటి ఇబ్బందుల నేపథ్యంలో ఈ సంక్రాంతి కి టాలీవుడ్ లోని కొన్ని క్రేజీ సినిమాలు  ప్రేక్షకుల ముందుకు వచ్చాయి..

వాటిలో రవితేజ నటించిన క్రాక్ సినిమా ముందుగా రిలీజ్ కాగా ఆ తర్వాత తమిళ డబ్బింగ్ సినిమా మాస్టర్, రామ్ పోతినేని నటించిన రెడ్, బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ సినిమాలు వరుసగా రిలీజ్ అయ్యాయి.. ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఈ సినిమాలను ప్రేక్షకులు బాగానే ఆదరించారు అని చెప్పొచు. ఏ సినిమా కి ఆ సినిమా ప్రత్యేకత నిండిన ఈ సినిమాల్లో ఎక్కువగా ప్రేక్షకులు ఆదరించిన సినిమా ఏదై ఉంటుంది అంటే రవితేజ నటించిన క్రాక్ సినిమానే అని చెప్పాలి.

అవును నాలుగు డిజాస్టర్ల తర్వాత పెద్దగా అంచనాలు లేకుండా బరిలో దిగిన రవితేజ క్రాక్ ఫైనల్ విజేతగా నిలిచిందని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. 9న విడుదలైన రోజే అన్ని వర్గాల నుంచి స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ అని పేరు తెచ్చుకున్న క్రాక్ ఆ టాక్ ని నిలబెట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. 13న మాస్టర్ అత్యధిక స్క్రీన్లలో రిలీజ్ చేయడం చాలా ప్రభావం చూపించినా దానికి వచ్చిన నెగటివ్ టాక్ క్రాక్ కి చాలా హెల్ప్ అయ్యింది. నైజాం డిస్ట్రిబ్యూటర్ తనకు జరిగిన అన్యాయం గురించి దిల్ రాజు మీద తీవ్ర నిరసన వ్యక్తం చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారడం చూస్తున్నాం. మాస్టర్రెడ్, అల్లుడు అదుర్స్ సినిమాలు సో సో ఫలితాలనే రాబట్టుకోవడంతో ఈ సంక్రాంతి విజేతగా క్రాక్ నిలిచింది అని చెప్పొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: