ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...సౌత్ ఇండియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న హీరోలలో విజయ్ ఒకడు. తాజాగా  విజయ్ హీరోగా ‘ఖైదీ' ఫేమ్ లోకేష్ కనగరాజన్ డైరెక్షన్లో వచ్చిన తాజా చిత్రం ‘మాస్టర్’. మరో క్రేజీ స్టార్ విజయ్ సేతుపతి ఈ చిత్రంలో విలన్ గా నటించాడు. అందువల్ల  మొదటి నుండీ ఈ చిత్రం పై భారీ అంచనాలే వున్నాయి. కేవలం తమిళంలో మాత్రమే కాదు తెలుగులో కూడా ఈ చిత్రం పై భారీ అంచనాలు వున్నాయి.

ఇక  జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ ను సంపాదించుకుంది. ఆశించిన స్థాయిలో ‘మాస్టర్’ ఎంటర్టైన్ చెయ్యలేకపోయాడు అని ప్రేక్షకులు పెదవి విరిచారు. అయితే కలెక్షన్ల పరంగా మాత్రం ఈ చిత్రం మాస్ వసూళ్ళు రాబాట్టింది. తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన 3రోజుల్లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ ను సాధించింది.

తెలుగు రాష్ట్రాల్లో ‘మాస్టర్’ చిత్రానికి 9కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. 5 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 11.76 కోట్ల షేర్ ను నమోదుచేసింది. దాంతో ఈ చిత్రం 2.76కోట్ల వరకూ లాభాలను సాధించి మంచి విజయాన్ని అందుకుంది.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: