
ఎలా అయితే ఆ సన్నివేశంలో తను బెండ్ చేశారో.. అలానే అసిస్టెంట్ డైరక్టర్ ని పట్టుకుని పర్టిక్యులర్ సీన్స్ కు అలానే డబ్బింగ్ చెప్పాడు. అలా డబ్బింగ్ చెప్పాలని చెప్పిన ఐడియా ఎవరిదో తెలియదు కాని అలా చెప్పడం నరేష్ డెడికేషన్ ను అందరికి తెలిసేలా చేస్తుంది. సినిమా పట్ల నరేష్ కు ఉన్న కమిట్మెంట్, డెడికేషన్ ఏంటన్నది ఈ ఒక్క సీన్ చెబుతుంది. ముఖ్యంగా కొంతకాలంగా సరైన సక్సెస్ లేక కెరియర్ లో వెనకపడిన అల్లరోడు నాందితో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు.
జనవరిలో వచ్చిన బంగారు బుల్లోడు సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర పరాజయపాలైంది. అందుకే నాంది మీద పూర్తి నమ్మకం పెట్టుకున్నాడు. ఈ సినిమా తప్పకుండా అంచనాలను అందుకుంటుందని చెబుతున్నారు. సినిమాలో అల్లరి నరేష్ తన నట విశ్వరూపం చూపించాడని అంటున్నారు. ఇప్పటికే ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి. మరి నాంది సినిమా ఎలా ఉంటుందో శుక్రవారం బొమ్మ ప్రేక్షకుల ముందుకు వచ్చాక తెలుస్తుంది.