
చిరంజీవి తమ్ముడిగా తెలుగు తెరకు పరిచయమైనా.. తనకంటూ సొంత ఇమేజ్ సంపాదించుకున్న నటుడు పవన్ కళ్యాణ్. 1996లో వచ్చిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో తెరంగేట్రం చేశాడు.
పవన్ కళ్యాణ్ కు 1995లో విశాఖకు చెందిన నందిని అనే అమ్మాయితో వివాహమైంది. ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లే. అందరి సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. అయితే కొన్ని రోజుల తర్వాత దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో నందిని వాళ్ల పుట్టింటికి వెళ్లిపోయింది. భర్త నుంచి భరణం కావాలంటూ నందిని పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. నెలకు 5 లక్షలు కావాలని డిమాండ్ చేసింది.
1999లో నందిని నుంచి పవన్ కళ్యాణ్ విడాకులు కోరాడు. ఇందుకు తాను సిద్ధంగా లేనని నందిని సమాధానమిచ్చింది. 2000 సంవత్సరంలో వచ్చిన బద్రి సినిమాతో రేణు దేశాయ్ కి పవన్ కళ్యాణ్ కు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం సహజీవనానికి దారి తీసింది. అప్పటి వరకు హీరోగా ఉన్న పవన్ కళ్యాణ్.. బద్రి, ఖుషీ లాంటి సూపర్ డూపర్ హిట్స్ అందుకున్నాడు. పవన్ కళ్యాణ్ కాస్తా.. పవర్ స్టార్ గా మారిపోయాడు. స్టార్ హీరో అయ్యాడు.
2005లో నందిని కూడా విడాకులకు అంగీకరించడంతో 2008లో కోర్టు డైవర్స్ మంజూరు చేసింది. పవన్ కళ్యాణ్ నందినికి ఐదు కోట్లు వరకు ఇచ్చాడని ఫిల్మ్ నగర్ లో టాక్ వచ్చింది.
తర్వాత నందిని .. తన పేరును జాహ్నవిగా మార్చుకుంది. పింగలి రణధీర్ రెడ్డి, సుధా దంపతుల కొడుకు డాక్టర్ కృష్ణా రెడ్డిని వివాహమాడింది. అలా పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని రెండో పెళ్లి చేసుకుని తన జీవితాన్ని సంతోషంగా కొనసాగిస్తోంది.