యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న లేటెస్ట్ సినిమా రౌద్రం రణం రుధిరం. రాజమౌళి దర్శకత్వంలో డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తుండగా ఎన్టీఆర్ కొమరం భీమ్ గా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా కనిపించనున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ఈ ఇద్దరు హీరోల ఫస్ట్ లుక్ టీజర్లు యూట్యూబ్లో భారీ స్థాయిలో వ్యూస్ దక్కించుకున్నాయి. బాహుబలి రెండు భాగాల సినిమాల తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న మూవీ కావడం అలానే ఫస్ట్ టైం ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో దీనిపై అందరిలోనూ విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి.

కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీకి సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫీని అందిస్తుండగా సాయి మాధవ్ బుర్రా మాటలని అందిస్తున్నారు. ఈ మూవీ ఈ ఏడాది అక్టోబర్ 13వ తేదీన ఎంతో గ్రాండ్ లెవల్లో రిలీజ్ కానుంది. ఇక దీని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక సినిమాలో నటించనున్న విషయం తెలిసిందే. మంచి పొలిటికల్ సెటైరికల్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా అధికారిక ప్రకటన ఇటీవల రావడం జరిగింది. సూర్యదేవర రాధాకృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ కలిసి ఎన్టీఆర్ ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థల పై నిర్మించనున్న ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర ఎంతో పవర్ ఫుల్ గా ఉంటుందని అలాగే ఆయనకు జోడీగా ఒక స్టార్ నటి హీరోయిన్ గా నటించనుందని టాక్.

తమన్ మ్యూజిక్ అందించనున్న ఈ సినిమాకు సంబంధించి తొలి షెడ్యూల్ శివరాత్రి రోజున ప్రారంభం కానుందని టాక్. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా క్లైమాక్స్ షూటింగ్ లో పాల్గొంటున్న ఎన్టీఆర్ మరొక రెండు రోజుల్లో దాన్ని పూర్తి చేయనున్నారని ఆపై పెద్ద బ్రేక్ తీసుకోకుండానే వెంటనే త్రివిక్రమ్ సినిమా షూటింగులో జాయిన్ కానున్నారని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు గానీ ఒకవేళ ఇదే గనుక నిజమైతే ఆర్ఆర్ఆర్ తర్వాత ఎక్కువ గ్యాప్ లేకుండా త్రివిక్రమ్ సినిమా కూడా థియేటర్స్ లోకి వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు విశ్లేషకులు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: