స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి గతేడాది 'అల వైకుంఠపురములో' తర్వాత స్టార్ డం అమాంతం పెరిగిపోయింది.త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన ఆ చిత్రం బన్నీ కెరీర్ లోనే పెద్ద హిట్ గా నిలిచింది.ఇక ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో 'పుష్ప' సినిమా చేస్తున్నాడు.గత ఏడాది అల్లు అర్జున్ పుట్టినరోజు కానుకగా సుకుమార్ 'పుష్ప' ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం అల్లు అర్జున్ అభిమానుల్లో ఎక్కడలేని ఆనందాన్ని నింపింది. అల్లు అర్జున్ కెరీర్ లో మొదటి పాన్ ఇండియన్ సినిమా మాత్రమే కాదు, మొదటి మల్టీ లింగువల్ ప్రాజెక్ట్ కూడా ఇదే కావడం విశేషం.ఇక మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు ఏప్రిల్ 8 అనే విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు.


ఆయన అభిమానులు ఆల్రెడీ సోషల్ మీడియా సెలబ్రేషన్స్ మొదలెట్టేసారు.ఈ ఏడాది బన్నీ పుట్టినరోజు సందర్భంగా 'పుష్ప' టీజర్ ను రిలీజ్ చేసేందుకు సుక్కు & టీమ్ సన్నద్ధమవుతున్నారు.బన్నీ ఎర్ర చందనం స్మగ్లర్ గా నటిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా విలన్ ఎవరు అనేది ఇప్పటివరకు సరైన క్లారిటీ లేదు. సో, టీజర్ కోసం బన్నీ ఫ్యాన్స్ మాత్రమే కాదు, తెలుగు సినిమా అభిమానులు కూడా వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ టీజర్ ను కట్ చేయడం మొదలెట్టారట. ఇక ఈ టీజర్ రికార్డులు క్రియేట్ చెయ్యడం ఖాయమట. ఈ టీజర్ పర్ఫెక్ట్ గా రావడానికి సుకుమార్ అండ్ టీం చాలా కష్టపడుతున్నారట. టీజర్ తోనే సినిమా పై అంచనాలను అమాంతం పెంచాలని చూస్తున్నాడట సుకుమార్. చూడాలి ఇక ఈ టీజర్ ఎలా ఉండబోతుందో. ఎంత మాత్రం అంచనాలను సృష్టించి రికార్డులని బద్దలు కొడుతుందో...

మరింత సమాచారం తెలుసుకోండి: