మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అలగేబె సినిమా మీద ప్రేక్షకుల్లో బాగానే అంచనాలు ఉన్నాయి. అలాగే ఈ సినిమాలో మరో ప్రత్యేకత ఏంటంటే మొట్టమొదట సరిగా పూర్తి స్థాయిలో చిరంజీవి, రామ్ చరణ్ కలిసి ఈ సినిమాలో నటించడం. అందుకనే  ఈ సినిమాపై అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి నెలకొంది. అలాగే ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్రకి గాను షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాడు.ఇకపోతే  ఈ చిత్రంలో రామ్ చరణ్ పాత్ర గురించి చూస్తే..  సిద్ధా అనే ఒక స్టూడెంట్ యూనియన్ లీడర్‌ ఎందుకు నక్సలైట్‌గా మారాడనే క్యారెక్టర్ లో నటిస్తున్నాడు రామ్ చరణ్.


ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర దాదాపు సినిమాలో 45 నిమిషాలు ఉంటుందట. అలాగే సమ్మర్ లో  ఇంకాస్త వేడి పుట్టించాడానికి మే 13న థియేటర్స్ లో సందడి చేయనున్నారు ఆచార్య టీమ్. ఐతే ఇక్కడే ఒక ఆసక్తికర విషయం దాగిఉంది.. అసలు ఈ సినిమాను  మే లో విడుదల చేయడంపై మెగా ఫ్యాన్స్ ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారు.ఎందుకు అనుకుంటున్నారా  దాదాపు 28 ఏళ్ల తర్వాత చిరంజీవి నటించిన ఆచార్య చిత్రం మే లో విడుదల అవుతోంది. అంతకముందు 1993లో గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్ నిర్మాణంలో బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన మెకానిక్ అల్లుడు సినిమా మే 27న విడుదల అయింది.అలాగే  1991లో గ్యాంగ్ లీడర్ సినిమా మే 9న రిలీజైంది.


సినిమా మంచి విజయం సాధించింది.  దీనికంటే ముందు 1990లో మే 9న విడుదలైన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌ అయ్యింది. ఇక 1986లో చిరంజీవి నటించిన ‘వేట’ మూవీ మే 28న విడుదలైంది. మొత్తంగా మే లో విడుదలైన గ్యాంగ్ లీడర్,జగదేకవీరుడు అతిలోకసుందరి  రెండు బ్లాక్ బస్టర్స్‌ హిట్స్ అయ్యాయి.మొత్తంగా మెగాస్టార్‌కు రెండు ఇండస్ట్రీ హిట్స్ వచ్చిన మే నెలలో ఇపుడు ‘ఆచార్య’ సినిమా విడుదల కానుండటంతో ఈ సినిమాపై మెగాభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మరి మే నెలలో ఆచార్యగా  రాబోతున్న మెగాస్టార్  ఇండస్ట్రీ హిట్ కొడతాడో లేదో అనేది వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: