భరత్ అనే నేను సినిమా తరువాత వినయ విధేయ రామ సినిమాలో చరణ్ కు జోడీగా నటించిన ఈ హాట్ బ్యూటీ ఆ సినిమాతో ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఆ సినిమాలో కియారా పాత్రకు మంచి పేరే వచ్చినా ఆ సినిమా ఫ్లాప్ గా నిలిచిన సంగతి తెలిసిందే.ఆ సినిమా తరువాత కియారాకు తెలుగులో పెద్దగా ఆఫర్లు రాలేదు. అయితే గత కొన్ని రోజుల నుంచి ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో కియారాను ఫైనల్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే కియరా ఎన్టీఆర్ సినిమాకు నో చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది.అయితే కియారా ఎన్టీఆర్ సినిమాకు నో చెప్పినా రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. అయితే కియారా ఈ ప్రాజెక్ట్ లో ఫైనల్ అయినట్టు ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే కియారా ఎన్టీఆర్ కు నో చెప్పి రామ్ చరణ్ కు ఓకే చెప్పడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.దీంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కియారా పై కోపంగా ఉన్నారట. యంగ్ టైగర్ స్టార్ హీరో కాబట్టి పైగా తెలుగులో టాప్ హీరో కాబట్టి కియారా నో చెప్పినందుకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆమెపై కోపంగా వున్నారని సమాచారం అందుతుంది...
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి