మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక సినిమా రూపొందబోతున్నట్లుగా కొద్ది రోజుల క్రితం అధికారిక ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. దాదాపు 11 ఏళ్ళ తరువాత మహేష్ బాబు త్రివిక్రమ్ కలిసి సినిమా చేస్తూ ఉండడంతో ఈ సినిమా మీద అంచనాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన మినహా మరే వివరాలు తెలియక పోవడంతో ఈ సినిమాకు సంబంధించి రోజుకు ఒక ప్రచారం వెలుగులోకి వస్తోంది.


  ఈ సినిమాలో మహేష్ బాబు ఒక రా ఏజెంట్ గా నటిస్తున్నాడని, సినిమాకి పార్ధు అనే టైటిల్ ఫిక్స్ చేశారని ఇలా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకి త్రివిక్రమ్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ కి సంబంధించి కొత్త ప్రచారం మొదలైంది. అదేమిటంటే ఈ సినిమా కోసం త్రివిక్రమ్ ఏకంగా 15 కోట్ల దాకా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సన్నాఫ్ సత్యమూర్తితో మొదలు త్రివిక్రమ్ ఎక్కువగా హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ తోనే సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను కూడా అదే సంస్థ తో త్రివిక్రమ్ అనౌన్స్ చేయించారు. 

సినిమా కోసం మహేష్ బాబు కూడా భారీ ఎత్తున రెమ్యూనరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం పార్ధు అనే టైటిల్ ఎప్పుడో రిజిస్టర్ చేశారని అంటున్నారు. చాలా సంవత్సరాల నుంచి త్రివిక్రమ్ దానిని రెన్యువల్ చేయించుకుంటూ వస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో ఇద్దరు ముగ్గురు నిర్మాతలు ఈ టైటిల్ తమకు కావాలని అడిగినా త్రివిక్రమ్ ఇవ్వలేదని అలాంటి పవర్ఫుల్ టైటిల్ ఇప్పుడు మహేష్ కు వాడుతున్నాడు అని తెలుస్తోంది. మరి ఇందులో నిజానిజాలు ఏ మేరకు ఉన్నాయి అనేది తెలియాల్సి ఉంది. సినిమాలో హీరోయిన్ పూజా హెగ్డే, దిశాపటాని, జాన్వీకపూర్, నిధి అగర్వాల్ వంటి హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి. ఎవరిని ఫైనల్ చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: