కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ చాలా దారుణంగా ఉంది. మొదటి వేవ్ కంటే చాలా రెట్లు ఎక్కువగా ఈ వేవ్ లో పెద్ద ఎత్తున కరోనా కేసులు నమోదు కావడమే కాక మరణాలు కూడా సంభవిస్తున్నాయి. అంతేకాక చాలా మంది సెలబ్రిటీలు  కూడాకరోనా బారిన పడుతున్న సంగతి తెలిసిందే. తమ అభిమాన నటులకు కరోనా అని తెలుసుకొని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఇక కొద్ది రోజుల క్రితం సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తనకు కరోనా పాజిటివ్ అనే విషయాన్ని తారక్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ఆయన ప్రస్తుతం సెల్ఫ్ ఐసొలేషన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నాడు. 


తాను బానే ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఆయన గురించి టెన్షన్ పడుతున్న కొందరు అభిమానులు అయితే దేవాలయాలకు వెళ్లి త్వరగా కోలుకోవాలని పూజలు చేస్తున్నారు. ఎలా అయితే పవన్ కళ్యాణ్‌కు కరోనా అని తెలిసి ఆయన అభిమానులు కోలుకోవాలని పూజలు చేశారో అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ప్రత్యేక పూజలు చేస్తున్నారు. 

'మా నందమూరి తారక రామారావు గారు కోవిడ్ నుంచి తొందరగా కోలుకోవాలని ఈ రోజు తిరుపతిలో దేవాలయానికి, మసీదుకు, చర్చికి వెళ్లి మత ప్రార్థనలు చెయ్యడం జరిగింది' అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పూజ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక మే 20న జూనియర్ బర్త్ డే కావడంతో ఆ సమయానికి పూర్తిగా కోలుకొని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక ఆయన పుట్టిన రోజు సంధర్భంగా ఆయన చేస్తున ఆర్ఆర్ఆర్ సహా కొరటాల సినిమా నుంచి కూడా అప్డేట్స్ వస్తాయని భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: