
సోనూ గొప్పతనం ప్రజలను కూడా కదిలిస్తోంది. దీంతో దేశం నలుమూలల నుంచి ఎంతో మంది సోనూకు విరాళాలు అందిస్తున్నారు. అలాంటి వారిలో కొంతమంది పేదలుకూడా ఉన్నారు. ఇటీవల ఓ అంధురాలైన మహిళ తన 3 నెలల పెన్షన్ డబ్బులను సోనూకు విరాళంగా పంపింది. దీంతో ఆమెను ప్రశంసిస్తూ సోననూసూద్ ఓ ట్వీట్ కూడా చేశాడు. ‘తన దృష్టిలో ప్రపంచంలోనే ఆమె అత్యంత ధనవంతురాలం’టూ కీర్తించాడు. కాగా.. తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దివ్యాంగ యువకుడు సోనూకు విరాళం అందించాడు. దీంతో అతడిని కుర్రాడిని ప్రశంసల్లో ముంచెత్తాడు.
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన అఫ్రిది అనే యువకుడు తన 3 నెలల జీతాన్ని సూద్ ఫౌండేషన్‌కు విరాళంగా పంపాడు. రైల్వే మంత్రిత్వ శాఖలో ఉద్యోగం చేస్తున్న అఫ్రిది ఒక యాక్సిడెంటులో కాళ్లు పోగొట్టుకున్నాడు. అయినాసరే ఇతరులకు సాయం చేయాలనే ఉద్దేశ్యంతో తన జీతాన్ని సూద్ ఫౌండేషన్‌కు పంపించాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించిన సోనూసూద్.. ఇలాంటి హీరోలే ప్రపంచాన్ని మరింత గొప్ప ప్రదేశంగా మారుస్తారని పేర్కొన్నాడు.