ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న సంగతి తెలిసిందే.. మొదటి దశ కరోనా కన్నా కూడా రెండో దశ కరోనా ప్రభావం చాలా వేగంగా వ్యాపిస్తూ వస్తుంది. గతంలో మరణాల రేటు తక్కువగా ఉంది. కానీ ఇప్పుడు పాజిటివ్ కేసుల తో పాటుగా మరణాల రేటు కూడా ఎక్కువగా నమోదు అవుతుంది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పాక్షికంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. మరి కొన్ని రాష్ట్రాల్లో కేసులు ఆందోళన కలిగిస్తుండటంతో లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు.


తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇకపోతే వ్యాక్సిన్ పంపిణీని కూడా అధికారులు  వేగవంతం చేశారు. కరోనా రోగుల కోసం ఏర్పాటు చేసిన ఆసుపత్రులు రోగులకు సరిపోవడం లేదు. బెడ్లు ఖాళీ అవ్వక ముందే రోగుల సంఖ్య పెరగడం పై ఆసుపత్రి సిబ్బంది తో పాటుగా రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉందన్న విషయం తెలిసిందే. ఆక్సిజన్ కొరత ఏర్పడటం తో చాలా మంది ప్రాణాల ను విడిచారు.


ఈ పరిస్థితిని అదుపు చేసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు తమ వంతు సాయాన్ని ప్రకటిస్తున్నారు. ఈ మేరకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కీలక ఆలోచన చేశారు. కరోనా కేసులు  సాధారణ స్థితికి వచ్చే వరకు కోవిడ్ జీవనోపాధి కోసం ఆక్సిజన్ సాంద్రతలను కొనడానికి లేదా అద్దెకు ఇవ్వడానికి స్థోమత లేని నిరుపేదలకు మరియు పేద రోగులకు సాయం చేయడానికి ఎసిలిటీ ఏర్పాటు చేయబడిందని ట్వీట్ చేశారు. ఈ సాయం కావాలనుకునేవారికోసం 080-45811138 హెల్ప్ లైన్ నంబర్ ను కూడా ఏర్పాటు చేశారు. ఇలాంటి ఆలోచన వాళ్లకు రావడం నిజంగా గ్రేట్ అంటూ తెలుగు ప్రజలు అభినందించారు.


 

మరింత సమాచారం తెలుసుకోండి: