ఆ చిన్నారి పరిస్థితి సుధీర్ బాబు ద్వారా తెలుసుకున్న పలువురు విరాళాలు పంపించారు. దీంతో ఆ చిన్నారికి శస్త్ర చికిత్స జరిగి ప్రాణాపాయం నుంచి బయటపడింది. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉంది కూడా. తను పెద్దయ్యాక ఆమె చదువుకోసం బ్యాంకులో కొంత సొమ్ము డిపాజిట్ చేస్తానని హామీ ఇచ్చాడు సుధీర్ బాబు. పసిబిడ్డ ప్రాణాలు కాపాడేందుకు కృషి చేసిన సుధీర్‌బాబుపై నెటిజెన్ల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. సుధీర్‌బాబు మామగారైన సూపర్‌స్టార్ కృష్ణకు ఇండస్ట్రీలో మంచి వ్యక్తి అన్న పేరుంది. ఆయన సినిమాల్లో అవకాశాలు తగ్గి కష్టాల్లో ఉన్న పలువురు నటీనటులకు సాయం అందించేవారని చెబుతారు. ఆయన వారసుడు మహేష్‌బాబు కొన్ని గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి