టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం మళ్లీ ఫామ్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల 'పూరి మ్యూజింగ్స్ ' పేరిట పలు ఇంట్రెస్టింగ్ అంశాల గురించి చెబుతున్నారు. తాజాగా ఆయన ప్రాక్టీస్ అనే అంశంపై మాట్లాడుతూ బిగ్ బి అమితాబచ్చన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే, మన జీవితంలో ఎంత నేర్చుకున్నా ప్రాక్టీస్ విషయంలో అశ్రద్ధ చేయకూడదు. మనకు చాలా బాగా తెలుసు కదా అని అభ్యాసం చేయకపోతే ప్రయోజనం ఉండదు. ఈ విషయంపై బ్రూస్ లీ అన్న మాటలను గుర్తు చేశారు. నాకు పదివేల కిక్స్ తెలిసిన వాడిని చూస్తే భయపడను కానీ, ఓకే కిక్ ను పదివేల సార్లు ప్రాక్టీస్ చేసిన వాడంటే మాత్రం కాస్త జాగ్రత్తగా ఉంటాను. ఎందుకంటే ప్రాక్టీస్ కారణంగా ఆ కిక్ లో వాడు మాస్టర్ అయి ఉంటాడు. అలాంటివాడు ఆ కిక్ ఉపయోగించాడు అంటే కాలు విరగడం పక్కా.
 
మనకు ఎంత తెలుసు అన్నది ముఖ్యం కాదు ఎంత లోతుగా తెలుసు అన్నది ప్రధానం. అందుకే మనకు ఏది బాగా తెలుసు అందులో మాస్టర్ అయిపోవాలి. అందుకోసం ఎంతో ప్రాక్టీస్ చేయాలి. ఒక నైపుణ్యం గురించి నీకు ఎంతో బాగా తెలిసి ఉండొచ్చు. కానీ నాకు అన్నీ తెలుసు అని తేలిగ్గా తీసుకోవడం అవివేకమే అవుతుంది. అంతెందుకు అమితాబచ్చన్ వంటి అగ్ర నటుడు సైతం ప్రాక్టీస్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఆయనతో నేను పని చేశాను. ఆయన్ని దగ్గరుండి గమనించాను. ఆయన ఎంతో గొప్ప యాక్టర్, సీనియర్ కథానాయకుడు. నటనారంగంలో ఆరితేరిన వారు అయినా సరే షూటింగ్ అయిపోయిన వెంటనే ఆయనే స్వయంగా అసిస్టెంట్ దగ్గరకు వెళ్లి నెక్స్ట్ డే షూటింగ్ కోసం సీన్ ఏంటో తెలుసుకుని అందుకు సంబంధించిన పేపర్ ని తీసుకుంటారు. ఉదయాన్నే లేచి అడ్డం ఎదుట నిలబడి డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తారు. తనని తాను అద్దంలో చూసుకొని పర్ఫెక్ట్ గా వచ్చింది అని ఆయన ఫీల్ అయ్యే వరకు  ప్రయత్నిస్తారు.

అక్కడితో వచ్చింది  కదా అని ఆగిపోరు ఆ సీన్ ను డైరెక్టర్లను చెప్పమని ఎక్స్ప్రెషన్స్ నోట్ చేసుకుంటారు. అంతేకాకుండా ఆ సీన్ లో ఆయనతో పాటు ఎవరైతే ఉంటారో వారితో మళ్లీ ఒకసారి ప్రాక్టీస్ చేస్తారు. నటనా జ్ఞానం పరిపూర్ణంగా ఉన్న ఆయనే ప్రాక్టీస్ కు ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతారు. అందుకే ఆయన బాలీవుడ్ బిగ్ బీ. అమితాబ్ బచ్చన్ అయ్యారు ఎంతో మందికి స్ఫూర్తి దాయకంగా నిలిచారు. ఆయనతో పోలిస్తే మనం ఎంత వాళ్ళం. విజయ సోపానానికి సాధనే ప్రథమ ఆయుధం అంటూ బాలీవుడ్ కింగ్ బిగ్ బి ని ప్రశంసలతో ముంచెత్తారు పూరి.  

మరింత సమాచారం తెలుసుకోండి: