టాలీవుడ్ సినిమా చరిత్రలో కామెడీ ప్రధానంగా తెరకెక్కే సినిమాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమాలను అందరూ అంత తేలికగా తీయడం వీలు కాదు. అందుకే మనకు హాస్య ప్రధానమైన సినిమాలు అతి తక్కువగా వస్తుంటాయి. టాలీవుడ్ లో కొంతమంది డైరెక్టర్లు వారి సినిమాలలో కామెడీకి పెద్ద పీట వేస్తారు. అటువంటి వారిలో శ్రీను వైట్ల ఒకరు. శ్రీను వైట్ల సినిమాలలో కామెడీ మాములుగా ఉండదు. ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన "రెడీ" సినిమా గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సినిమా విడుదలయ్యి జూన్ 19 '2008 న విడుదలయింది. నిన్నటికి ఈ సినిమా 13 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. ఈ శుభ సందర్భంగా కొన్ని విషయాలను మీతో పంచుకుంటున్నాను.  ఈ సినిమా ఒక రొమాంటిక్ యాక్షన్ కామెడీ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

సినిమా తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు నవ్వకుండా థియేటర్ బయటకు రాలేదంటే నమ్మగలరా. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడానికి కారణమయిన కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం.

* డైరెక్టర్ శ్రీను వైట్ల తన ముందు సినిమాలలాగే కామెడీని ప్రధానంగా హైలైట్ చేశారు. ఈ విధానంలో ఎక్కడా డ్రాగ్ కాకుండా జాగ్రత్తపడ్డారు. ప్రతి పాత్ర నడుమ కామెడీని సృష్టించడంలో సక్సెస్ అయ్యాడు.

* ఇందులో నటించిన హీరో రామ్ తన నటనలో ఎంతో పరిపక్వత్వాన్ని చూపించాడు.  మాస్టర్ భరత్ కు రామ్ కి మధ్యన వచ్చే సన్నివేశాలలో రామ్ నటన అద్భుతంగా ఉంది.

* రామ్ మరియు జెనీలియా మధ్యన ప్రేమ సన్నివేశాలు, వారి మధ్య అల్లరి బాగా చూపించాడు. జెనీలియా తన పాత్రా మేరకు చాలా బాగా నటించింది.
* ఈ చిత్రంలో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిన పాత్రల్లో బ్రహ్మానందం, జయప్రకాశ్ రెడ్డి లు కూడా ఉన్నారు. ఎంఎస్ నారాయణ పాత్ర కూడా ఆకట్టుకుంది.

 
* సినిమా చూస్తున్నంతసేపు ఎక్కడా బోర్ అనే ఫీల్ రాకుండా డైరెక్టర్ శ్రీను వైట్ల తన స్క్రీన్ ప్లే తో అదరగొట్టాడు.

* ఇక సినిమాకు ప్రాణమైన మ్యూజిక్ విషయంలో ఫుల్ క్రెడిట్ దేవి శ్రీ ప్రసాద్ కు ఇవ్వొచ్చు. ఈ సినిమాలో నేపధ్య సంగీతం మరియు అన్ని పాటలు వినసొంపుగా ఉన్నాయి. డిఎస్పీ పాటలకు ప్రత్యేక అభిమానులున్నారంటే నమ్మండి.

* 2008 లో విడుదలయిన అన్ని చిత్రాలలో ఈ సినిమా ప్రత్యేకంగా నిలిచింది.

* ఈ సినిమాకు వివిధ విభాగాల్లో మూడు నంది అవార్డులను దక్కించుకుంది.

* ఈ సినిమాను తరువాత కన్నడ, హిందీ, తమిళ్ లో రీమేక్ చేయడం జరిగింది. అన్ని భాషల్లోనూ ఇది సూప్ హిట్ గా నిలిచింది.

* రామ్ ఈ సినిమాకు ఉత్తమ నటుడి విభాగం క్రింద సౌత్ లో ఫిలిం ఫేర్ అవార్డును సొంతం చేసుకున్నాడు.

* ఈ సినిమా విజయమే రామ్ ను పెద్ద హీరోల సరసన చేరేలా చేసింది.  

* ఈ సినిమాను 8 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా, 17 కోట్ల వసూళ్లను సాధించి నిర్మాతలకు లాభాల్ని మిగిల్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: