అక్కినేని వారి కోడలు సమంత కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  ఏం మాయ చేసావే  సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయిన సమంతా.. ఇక మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత ఇక నాగ చైతన్యతో ప్రేమాయణం నడిపి చివరికి పెళ్లి చేసుకుంది.  అయితే పెళ్లి తర్వాత కూడా తన కెరీర్కి పులిస్టాప్  పెట్టకుండా మరింత స్పీడ్ తో దూసుకుపోతుంది ఈ అమ్మడు.  ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది.



 ఒక రకంగా చెప్పాలంటే సమంత కేరీర్ పెళ్లికి ముందు పెళ్లి తర్వాత అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  పెళ్లికి ముందు సాధించిన గుర్తింపు కంటే పెళ్లి తర్వాత సాధించిన గుర్తింపు ఎక్కువ. ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవడమే కాదు అటు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ అదరగొడుతోంది సమంత. ఇకపోతే ఇప్పటికే సమంత పలు బిజినెస్ లు స్టార్ట్ చేసి దూసుకుపోతుంది.  ఇప్పుడు సమంత కి ఒక స్కూల్ తో పాటు దుస్తుల బిజినెస్ కూడా ఉంది.  ఇలా హీరోయిన్ గానే కాకుండా బిజినెస్ ఉమెన్ గా కూడా ఆదర్శంగా నిలుస్తుంది అక్కినేనివారి కోడలు.



 ఇక ప్రస్తుతం కెరీర్ పరంగా దూసుకుపోతున్న సమంతా మరో బిజినెస్ లోకి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్టు టాక్ వినిపిస్తోంది.  జువెలరీ బిజినెస్ స్టార్ట్ చేయాలని సమంత భావిస్తోందట. ఇక అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలోనే సమంత జువెలరీ బిజినెస్ స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.  ఇకపోతే సమంత ఇటీవలే ది ఫ్యామిలీ మాన్ 2 అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ సినిమాలో నెగటివ్ పాత్రలో డీ గ్లామర్ గా నటించిన సమంత తన నటనతో ప్రేక్షకులను మెప్పించి విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: