ఏ నటీమణి కైనా అత్యుత్తమ
సినిమా ఇండస్ట్రీలో నటించాలనే కోరిక ఉంటుంది. అలా భారత దేశంలో అన్నిటికంటే పెద్ద స్థాయిలో గుర్తింపు ఉన్న
సినిమా పరిశ్రమ బాలీవుడ్. ఏ
సినిమా పరిశ్రమలో నటించినా కూడా బాలీవుడ్లో
సినిమా చేయాలనేది
హీరోయిన్ ల కోరిక.
హీరో ల కోరిక కూడా ఇదే. కాకపోతే హీరోయిన్ లు ఎక్కువగా తమ అందాలను
బాలీవుడ్ లో చూపించి పెద్ద
హీరోయిన్ అయిపోవాలని కలలు కంటూ ఉంటారు. అక్కడ ఒక్క
సినిమా చేసిన దేశవ్యాప్తంగా మంచి పేరు వస్తుందని తద్వారా వారికి పాపులారిటీ తోపాటు రేమ్యునరేషన్ కూడా బాగా అందుతుంది అని వారి ఆలోచన.
అక్కడ ప్రవేశం దొరకకపోతే చిన్న
సినిమా పరిశ్రమలో ఎలాగోలా అవకాశం సంపాదించుకొని అక్కడ నుంచి ఆ తరువాత
బాలీవుడ్ కి వెళ్తుంటారు. ఆ విధంగా
టాలీవుడ్ నుంచి చాలామంది హీరోయిన్లు
బాలీవుడ్ కు వెళ్లారు. అలాంటి వారిలో అక్కడ క్రేజ్ ను సంపాదించుకొని
టాలీవుడ్ పేరు నిలబెట్టిన హీరోయిన్లను చూద్దాం.
టాలీవుడ్ లో మంచి
హీరోయిన్ గా గుర్తింపు పొందిన
సమంత ఇటీవలే
బాలీవుడ్ లో ఓ వెబ్ సిరీస్ ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకోగా అది సూపర్ డూపర్ హిట్ కావడంతో ఆమెకు ఇప్పుడు
బాలీవుడ్ లో వరుస అవకాశాలు వస్తున్నాయట. ఫ్యామిలీ మాన్ సీజన్ 2 లో
సమంత నటనకు
బాలీవుడ్ ప్రేక్షకులు విస్మయం చెందారు.