నిన్నటి తరం
రొమాంటిక్ అండ్ స్టార్ హీరోలలో ఒకరు
హీరో ప్రశాంత్. తమిళనాడు లో ఎంతో క్రేజ్ ఉన్న
హీరో ఈయన. జీన్స్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. విశ్వసుందరి
ఐశ్వర్య రాయ్ తో నటించిన ఘనత దక్కించుకున్న ప్రశాంత్. హీరోగా తన కెరీర్ ను చాలా సంతోషంగా ఉంచుకున్న కూడా వ్యక్తిగత జీవితంలో మాత్రం అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. తన సొంత
భార్య వల్ల అనేక మానసిక సమస్యలకు గురయ్యడట ఈ హీరో. తన
భార్య వల్లే జీవితం మొత్తం తలకిందులు అయ్యిందని అంటున్నాడు ప్రశాంత్.
మరి తన జీవితాన్ని ఇంత ఇబ్బంది పెట్టిన ఆయన వైవాహిక జీవితంలోని కొన్ని సంఘటనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పెద్దలు కుదిర్చిన వివాహాన్ని చేసుకున్నాడు ప్రశాంత్. గృహలక్ష్మి అనే లక్షణమైన అమ్మాయితో
పెళ్లి జరిగింది. ఈ ఇద్దరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే గృహలక్ష్మి కి అప్పటికే
పెళ్లి జరిగిందనే విషయాన్ని దాచి
ప్రశాంత్ కి ఇచ్చి వివాహం చేశారు
అమ్మాయి తరపు వాళ్ళు. అంతే కాదు
ప్రశాంత్ తో వివాహం అనంతరం కూడా గృహలక్ష్మి మొదటి
భర్త తో సంబంధం పెట్టుకుంది. ఈ కారణంగానే కోర్టులో విడాకుల కోసం అప్లై చేసాడు. ప్రశాంత్.
తన
భార్య గురించి కోర్టులో జడ్జి ముందు ఏకరువు పెట్టుకున్నాడు కానీ గృహలక్ష్మి చెబుతున్న విషయం మరోలా ఉంది.
ప్రశాంత్ కుటుంబం తమ వద్ద చాలా కట్నకానుకలు తీసుకుని ఇప్పుడు మరొక
పెళ్లి చేసుకోవడం కోసమే తన పైన లేనిపోని నిందలు వేసి అభాసుపాలు చేసి విడాకులు ఇవ్వాలని చూస్తున్నాడు అని చెప్తుంది. ఇందులో నిజానిజాల సంగతి పక్కన పెడితే మాత్రం ఈ ఇద్దరి మధ్య నలిగిపోతున్నాడు చిన్నారి.
ప్రశాంత్ కెరీర్ విషయంలో కూడా ఈ ఘటన తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. కెరియర్లో ఆయనతోపాటు ఉన్న హీరోలు ఇప్పుడు స్టార్ హీరోలు గా ఉండగా
ప్రశాంత్ హీరోగా కూడా నిలదొక్కుకోలేక పోయాడు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మరి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు. మరి ఆయన సినీ జీవితం ఎలా ముందుకు సాగుతుంది చూడాలి.