తమ పదహారేళ్ల వివాహ జీవితానికి
బాలీవుడ్ స్టార్
హీరో అమీర్ ఖాన్ కిరణ్ రావు స్వస్తి పలికారు. ఈ మేరకు ఒక ప్రకటన వారు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక తాము కలిసి ఉండలేమని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తామని ఇద్దరూ కలిసి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే ఇంతకాలం
అమీర్ ఖాన్ భార్య గా ఉండవచ్చు ఆమె కానీ ఆమె తన కంటూ ఒక ప్రత్యేకమైన పేరు సంపాదించుకుంది.
బాలీవుడ్ లో రచయితగా దర్శకురాలిగా తన సత్తా చాటి తన కష్టంతో ఉన్నత స్థానాన్ని చేరుకుంది
కిరణ్ రావు.
నిర్మాత
రచయిత దర్శకురాలిగా ఎన్నో సినిమాలు చేసింది. తన సంపాదన మొదలైన నాటి నుంచి ఆమె ఎన్జీవో సంస్థలకు కూడా సాయం చేస్తూ వచ్చి తన మంచి మనసు చాటుకున్నారు. అయితే వీరిద్దరు విడిపోయిన నేపథ్యంలో చాలా మంది ఆమె నేపథ్యం వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. అలాంటి వాటిలో ఒకటి ఆమె ఆస్తుల విషయం. వీరు విడిపోయిన నేపథ్యంలో ఆమె ఆస్తులు ఇప్పుడు ఎలా ఉన్నాయో చూద్దాం.
మీడియా నివేదికల ప్రకారం
కిరణ్ రావు నికర ఆస్తుల విలువ సుమారు 40 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. మహిళా దర్శకురాలిగా
కిరణ్ అత్యధికంగా సంపాదించిన వ్యక్తిగా పేరు గడించారు. అంతేకాకుండా
అమీర్ ఖాన్ కు చాలా సూపర్ హిట్ సినిమాలను సైతం అందించారు ఈమె. దీంతో పాటు
మీడియా నివేదికల ప్రకారం అమీర్ మొత్తం ఆస్తులు సుమారు 1434 కోట్ల రూపాయలు ఉంటాయని అంచనా. ఇక ఆయన ఒక చిత్రానికి 85 కోట్ల వరకు వసూలు చేస్తారని పేర్కొన్నారు. అయితే
కిరణ్ కు విలాసవంతమైన ఇల్లు,సొంతంగా ఖరీదైన వాహనాలు ఉన్నాయి.
కిరణ్ తనకు ఇల్లు, వాహనాలు ఉన్నాయని మాత్రం ఎక్కడా స్పష్టం చేయలేదు.
మీడియా నివేదికల ప్రకారం 20 మిలియన్ లు. అంతే 146 కొట్లుగా 2020లో అంచనా వేశారు.