సినిమా పరిశ్రమలో అవకాశాలు రావాలంటే
హీరోయిన్ లు ఎంతో కష్టపడాల్సి వస్తుంది. పోనీ వచ్చిన అవకాశం నిలబడుతుందా అంటే వారు ఏమాత్రం చిన్న తప్పు చేసినా కూడా అవకాశం ఫ్లాప్ అయి తమ కెరియర్ నాశనం అయ్యే విధంగా పోతుంది. అలా చాలా మంది
హీరోయిన్ లు ఇప్పటివరకు ఎన్నో తప్పులు చేసి తమ కెరీర్ ను చేజేతులా నాశనం చేసుకున్నారు. ఒక సినిమాకి రెండు సినిమాలకే పరిమితం అయి సదరు
హీరోయిన్ లు తర్వాత
సినిమా అవకాశాలు దక్కించుకోలేక పోతున్నారు.
ఆ విధంగా
నాగార్జున బాస్ సినిమాలో నటించిన పూనమ్ బజ్వా ఒకటి రెండు సినిమాలతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న కూడా ఆ తరువాత అవకాశాలు రప్పించుకోవడం లో విఫలం అయింది. దాంతో కొన్ని సినిమాలకే కనుమరుగైపోయింది ఈ ముద్దుగుమ్మ. సోషల్
మీడియా ద్వారా ఈ ముద్దుగుమ్మ పెట్టే పోస్టులకు ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. తన కొత్త కొత్త విషయాలతో పాటు లేటెస్ట్ ఫోటోలు కూడా పెడుతూ తన అభిమానాన్ని పెంచుకుంది. మొదటి
సినిమా అనే సినిమాతో
టాలీవుడ్ కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ బాస్ సినిమాతో కొత్త పాపులారిటీ దక్కించుకుంది కానీ ఆ తర్వాత ఎక్కువగా
సినిమా అవకాశాలు అందుకోలేకపోయింది.

కన్నడ
తమిళ మలయాళ భాషలలో సైతం తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా అక్కడ కొంత వరకు
సక్సెస్ అయ్యింది. ప్రస్తుతం మలయాళంలో ఒక
సినిమా చేస్తుంది. తెలుగులో ఆఖరిగా ఆమె ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో గారపాటి లోకేశ్వరి పాత్రలో నటించగా మళ్లీ అప్పటి నుంచి ఆమెకు ఆ అవకాశం దక్కకుండా పోయింది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తన లో అందాలను చూపిస్తూ అవకాశాల కోసం ఏం చేయడానికైనా రెడీ అయినట్లు చెబుతోంది. మరి ఇప్పటికైనా మన దర్శక నిర్మాతలు ఈ బొద్దుగుమ్మ పై కన్నేస్తారా చూడాలి.