కరోనా మహమ్మారి వల్ల ప్రతి ఒక్కరికి ఎన్నో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొంతమంది ఆ ఇబ్బందులను తట్టుకుని నిలబడగలిగి జీవనం కొనసాగిస్తున్నారు. మరికొంతమంది ఈ మహమ్మారి వల్ల తమ ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. అసలే దీని వల్ల మరిన్ని కష్టాలకు లోనవుతున్న ప్రజలను దశలవారీగా కరోనా ఎంతో ఇబ్బంది పెడుతుంది. పెద్ద  పెద్ద పెద్ద వారిని సైతం ఈ మహమ్మారి దహించుకుపోయింది. సమాజంలో మంచి హోదా పేరు ప్రఖ్యాతలు ఉన్న వారు కూడా దీనికి అతీతులు కాలేదు.  ఎంతో మంది జర్నలిస్టులు, సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు కరోనా మహమ్మారి వల్ల చనిపోయారు.

టీఎన్నార్, బి ఏ రాజు,  కత్తి మహేష్ లాంటి సినిమా జర్నలిస్టులకు ఈ మహమ్మారి సోకి అతి తక్కువ సమయంలో వారిని మనకు దూరం చేసింది. కేవలం రెండు నెలల వ్యవధిలోనే ఈ ముగ్గురు సినీ జర్నలిస్టు మరణించడం టాలీవుడ్ కు తీరని లోటు కాగ భవిష్యత్తులో మరిన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందని వారు టెన్షన్ పడుతున్నారు సినీ జనాలు. ఈ ముగ్గురు సినీ పరిశ్రమలో ఎవరికి వారు తమదైన ముద్రను వేసుకున్నారు.  ఇప్పుడు ఈ ముగ్గురు కూడా కరోనా కి బలైపోయారు.

సినిమా జర్నలిస్టులకు దీనిద్వారా కష్టకాలం నడుస్తుంది అని చెప్పొచ్చు. ఊహించని మరణాలు సినిమా జర్నలిజాన్ని వెంటాడుతున్నాయి. ఒక మరణాన్ని మరచిపోకముందే మరొకరి మరణం వేధిస్తుంది. తాజాగా కత్తి మహేష్ మరణించగానే ఒక్కసారిగా సినిమా లోకం దిగ్భ్రాంతికి గురి అయ్యింది. ఆయన ఎలాంటి వాడు ఎలాంటి విమర్శలు చేశాడు అనేది పక్కన పెడితే మనిషి ప్రాణం పోయినప్పుడు అంతా ఒక్క క్షణం అయ్యో పాపం అనుకున్నారు. ఎప్పుడు విమర్శలు చేస్తూనే ఉంటే కత్తి మహేష్ 2010 లో ఇండస్ట్రీకి వచ్చి అప్పటి నుంచి తనకు నచ్చిన పని చేస్తూ బిగ్ బాస్ ద్వారా గుర్తింపు పొంది ఆ తర్వాత సంపూర్ణేష్ బాబు హృదయ కాలేయం లో పోలీస్ పాత్రలో నటించి నవ్వించారు. పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి అందరికీ విలన్ గా మారాడు. అయినా కూడా ఏ మాత్రం తగ్గకుండ  పోరాటం చేశాడు. చివరిగా క్రాక్ సినిమాలో కనిపించాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: