
టాలీవుడ్ లో అలనాటి హీరోయిన్ లకు ఒక్కొక్కరికి ఒక్కో కథ ఉండేది. ఎన్నో కష్టాలను ఎదుర్కొని వారు సినిమాలు చేసి తమ జీవనాన్ని కొనసాగించే వారు. హీరోలతో ఎంతో అనుబంధం ఏర్పరుచుకుని వారిని సొంత వారిలా భావిస్తూ ఒక్కో మెట్టు ఎదుగుతూ సినిమాలు చేసి స్టార్ గా ఎదుగుతారు. ఆ తర్వాత వారు సినిమాలకు గుడ్ బై చెబుతారు. ఆ విధంగా అలనాటి నటి అశ్విని గురించి ఆమె జీవితం గురించి తెలుసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు లో జన్మించిన ఈమె భక్త మార్కండేయ అనే చిత్రంలో బాల నటిగా నటించి సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది.
ఆ తర్వాత తమిళ మలయాళ చిత్రాల్లో నటించి అనాదిగా ఆడది అనే సినిమా ద్వారా హీరోయిన్ తెలుగు లోకి ఎంట్రీ ఇచ్చింది. 1985 లో నందమూరి బాలకృష్ణ నటించిన భలే తమ్ముడు సినిమా ఆమెకు మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా ఆ తర్వాత కర్పూరదీపం, అరణ్యకాండ, త్రిమూర్తులు, భానుమతిగారి మొగుడు, అమెరికా అబ్బాయి, కలియుగ పాండవులు, చూపులు కలిసిన శుభవేళ , వివాహ భోజనంబు పెళ్ళి చేసి చూడు, స్టేషన్ మాస్టర్ వంటి చిత్రాలతో హీరోయిన్ గా ఎదిగింది.
మొత్తం అన్ని భాషలలో కలిపి దాదాపు 150 చిత్రాలకు పైగా నటించిన అశ్విని పదేళ్లపాటు ఇండస్ట్రీలో ఉండి ప్రేక్షకులను తన నటనతో ఎంతగానో మెప్పించింది. ఎక్కువగా రాజేంద్రప్రసాద్ సినిమాల్లో నటించిన ఈమె లివర్ సంబంధిత వ్యాధితో ఎక్కువ కాలం చెన్నై లోనే ఉండి చికిత్స తీసుకోగా అక్కడ తమిళ నటుడు దర్శకుడు పార్తి బన్ ఆమెతో ఓ సినిమా చేయాలని భావించాడు. కానీ చెన్నైలోని రామచంద్ర మిషన్ హాస్పిటల్ లో 2012వ సంవత్సరంలో కన్నుమూసింది. అప్పటికి ఆమెకు పెళ్లి కాలేదు. అయితే కార్తీక్ అనే కుమారుడిని దత్తత తీసుకుంది. పర్తిబన్ అతడి బాధ్యతలను చూస్తున్నాడు.