టాలీవుడ్ సినీ పరిశ్రమలో తన మొదటి సినిమా నుంచి ఎంతో వైవిధ్యాన్ని చూపిస్తూ రోజురోజుకీ స్టార్ హీరోగా ఎదుగుతున్నాడు హీరో సత్యదేవ్. తొలుత సైడ్ పాత్రల్లో నటించి ఆ తర్వాత హీరోగా ఇప్పుడు స్టార్ హీరోగా ఎదిగాడు ఈ నటుడు. ఆయన హీరోగా నటిస్తున్న తిమ్మరుసు సినిమా ఈ శుక్రవారం విడుదల కానుండటంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను వేగవంతం చేశాడు. శరన్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో టాక్సీ వాలా ఫేమ్ ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటిస్తుంది.

సత్యదేవ్ నటించిన బ్లఫ్ మాస్టర్, ఉమామహేశ్వర రూపస్య వంటి చిత్రాలు సూపర్ హిట్ అందుకోగా తాజాగా ఆయన చేస్తున్న తిమ్మరుసు చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తన కెరీర్ గురించి ఎన్నో విషయాలు చెప్పిన సత్యదేవ్ చాలా చిత్రంగా తన సినిమా కెరియర్ మొదలైందని , చాలా చిన్న పాత్రలు చేశాను అని, ఎక్కడో వెనకాతల నన్ను నిలబెట్టారని, నన్ను ఎవరు చూస్తారు.. నేను ఎవరికి కనిపిస్తాను అని నేను ఎప్పుడూ అనుకోలేదని, నాకు చిన్న డైలాగ్ ఇచ్చినా బాగా ప్రాక్టీస్ చేసి నా స్టైల్  లో చెప్పడానికి ప్రయత్నించే వాడిని అలా నేనేంటో చూపించుకోవాలనే తపన నాకు మొదటినుంచి ఉండేది అని ఆయన చెప్పారు.

నేను ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చినా కెరియర్ పరంగా మరింత ముందుకు వెళ్ళడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. అన్నారు. నేను ఇంకా ముందుకు వెళ్లాల్సి ఉంది చాలా ఉందని, ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉందని ఒక నటుడిగా నేను ఇంకా చాలా జర్నీ చేయవలసి ఉందని చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరు సినిమాల దాకా చేస్తున్నారని చెప్పాడు. అందులో గుర్తుందా శీతాకాలం, గాడ్సే, స్కైలాబ్ సినిమాలు తెలుగులో చేస్తుండగా మిగితా మూడు ఇతర భాషల్లో చేస్తుండడం విశేషం. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ తో రామసేతు అనే సినిమా చేస్తున్నాడు సత్యదేవ్. 

మరింత సమాచారం తెలుసుకోండి: